సీతమ్మను బంధించిన అశోక్‌ వనంలో భారత క్రికెటర్లు (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు పల్లెకెలె వేదికగా శనివారం ప్రారంభం కానుంది.

మూడో టెస్టు కోసం భారత ఆటగాళ్లు ఇప్పటికే క్యాండీ చేరుకున్నారు. శనివారం ఉదయం భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి పల్లెకెలెకు అతి సమీపంలో ఉన్న అశోక వనాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

అశోకవనం సందర్శించిన టీమిండియా

‘రావణుడు సీతను బంధించిన అశోక్‌వనం సందర్శనకు టీమిండియా వచ్చింది. శ్రీలంకలోని సీత ఎలియా గ్రామంలో ఈ వనం ఉంది' అని మహమ్మద్ షమీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

హనుమంతుడి పాద ముద్ర వద్ద భార్యతో

అలాగే వనంలో హనుమంతుడి పాద ముద్ర వద్ద భార్యతో కలిసి దిగిన ఫొటోను ఉమేశ్‌యాదవ్‌ తన ఫేస్ బుక్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.

ఎవరెవరు?

ఎవరెవరు?

ఈ పర్యటనకు కుల్దీప్‌ యాదవ్‌, వృద్ధిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, మహమ్మద్‌ షమీ తమ కుటుంబ సభ్యులతో కలిసి అశోక వనాన్ని సందర్శించారు.

 టెస్టు

టెస్టు

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌ అనంతరం ఇరు జట్ల మధ్య ఆగస్టు 20 నుంచి ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. వన్డేల్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Members of the Indian cricket team enjoyed some down time by paying a visit to Ashok Vatika, a garden in Sita Eliya in the former kingdom of Ravana as mentioned in the Vishnu Purana and Hindu epic, Ramayana, ahead of the third and final Test against Sri Lanka, starting on Saturday. Mohammed Shami and Umesh Yadav posted pictures on their social media handles of their visit to the place where Ravana kept the Sita captive.
Please Wait while comments are loading...