యువీ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు టీమిండియా: ఎంజాయ్ చేస్తామన్న కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు భారత జట్టు హాజరవుతుందని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మొహాలి టెస్టులో భారత్ విజయం: 2-0తో ఆధిక్యం

Indian team will attend Yuvraj Singh's pre-wedding bash, says Virat Kohli

మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ మొహాలిలో మంగళవారం (నవంబర్ 29)న రాత్రి జరిగే యువరాజ్ ప్రీ-వెడ్డింగ్ బాష్‌కు టీమిండియా హాజరవుతుందని కోహ్లీ తెలిపాడు. 'అవును. హోటల్‌లో అంతా కలుస్తున్నాం. టీమ్ మొత్తాన్ని యువీ ఆహ్వానించాడు. యువీ ఫంక్షన్‌కు టీమ్ అంతా వెళుతున్నాం. నాలుగో రోజుల్లో టెస్టు ముగియడం, యువీ మమ్మల్ని ఆహ్వానించడం అనుకోకుండా జరిగాయి. టెస్టు విజయంతో టీమిండియా ఆనందంగా ఉందని, చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేయబోతున్నాం' అని కోహ్లీ తెలిపాడు.

ఫోటోలు: షమీ బౌన్సర్లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెంబేలు

యువరాజ్ సింగ్, కోహ్లీ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ టీమిండియాకు నేతృత్వం వహించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరుపున పలు మ్యాచ్‌లు కూడా ఆడారు. మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 103 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. ఇదిలా ఉంటే హాలీవుడ్ నటి, మోడల్‌ హజల్ కీచ్‌తో యువరాజ్ వివాహం నిరాడంబరంగా జరగనుంది.

Indian team will attend Yuvraj Singh's pre-wedding bash, says Virat Kohli

ఈనెల 30న చండీగఢ్‌లో పంజాబీ సంప్రదాయంలో యువీ వివాహం చేసుకోనున్నాడు. ముందుగా 30న సిక్కు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరిపించనున్నారు. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. డిసెంబర్ 5న చత్తార్‌పూర్‌లో సంగీత్, 7న ఢిల్లీలోని ఓ హోటల్‌లో రిసెప్షన్ జరుగనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Captain Virat Kohli said that the Indian Test team will tonight (November 29) attend Yuvraj Singh's pre-wedding bash in Mohali.
Please Wait while comments are loading...