ఐపీఎల్: గేల్ నుంచి సైమండ్స్ వరకు - టాప్ 10 ఆటగాళ్లు వీరే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టెస్టు క్రికెట్‌కి టీ20 క్రికెట్‌కి చాలా తేడా ఉంటుంది. టీ20 క్రికెట్ అనగానే అద్భుతమైన షాట్లు, పూర్తి ఎంటర్టెన్మెంట్ అని మన మదిలో మెదులుతుంది. అందుకు తగ్గట్టుగానే ఆటగాళ్లు సైతం ఈ పొట్టి ఫార్మెట్‌లో అభిమానులను అలరించేందుకు ఫోర్లు, సిక్సులతో హోరెత్తిస్తుంటారు.

క్యాష్-రిచ్ టోర్నమెంట్ అయిన ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008లో ఆరంభమైన కొత్తలో ఆటగాళ్లు కొట్టిన ఫోర్లు, సిక్సులు స్టేడియం దాటి బయటపడుతుంటే టెలివిజన్‌లో వాటిని చూపే విధానం ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తే.

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ని బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో ఏప్రిల్ 18, 2008న నిర్వహించారు. ఈ మ్యాచ్ కోల్‌కతా నైటరైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

IPL 10: Chris Gayle to Andrew Symonds - Here are top 10 scores

158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2013లో జరిగిన సీజన్‌లో క్రిస్ గేల్ మెక్ కల్లమ్ రికార్డుని అధిగమించాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

మొత్తంగా దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో సత్తా చాటడంతో పాటు అనేక రికార్డులను సైతం నెలకొల్పారు. ప్రస్తుతం ఐపీఎల్ తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదో సీజన్‌లోకి అడుగు పెట్టింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు జాబితా మీకోసం:

1. ఏప్రిల్ 23, 2013న పూణెతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ సాధించిన స్కోరు 175 నాటౌట్. (66 బంతుల్లో 175 నాటౌట్; 13 ఫోర్లు, 17 సిక్సులు).

2. ఏప్రిల్ 18, 2008న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బ్రెండ్ మెక్ కల్లమ్ 158 నాటౌట్ (73 బంతుల్లో 175 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సు)

3. మే 10, 2016న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 133 నాటౌట్ (59 బంతుల్లో 133 నాటౌట్; 19 ఫోర్లు, 4 సిక్సులు)

4. మే 14, 2016న గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 129 నాటౌట్ (52 బంతుల్లో 129 నాటౌట్; 10 ఫోర్లు, 12 సిక్సులు)

5. మే 17, 2012న ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 128 నాటౌట్ (62 బంతుల్లో 128 నాటౌట్; 7 ఫోర్లు, 13 సిక్సులు)

6. ఏప్రిల్ 3, 2010న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మురళీ విజయ్ 127 (56 బంతుల్లో 127 ; 8 ఫోర్లు, 11 సిక్సులు)

7. మే 30, 2014న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 122 (58 బంతుల్లో 122; 12 ఫోర్లు, 8 సిక్సులు)

8. ఏప్రిల్ 13, 2011న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్ వాల్తాటీ 120 నాటౌట్ (63 బంతుల్లో 120; 19 ఫోర్లు, 2 సిక్సులు)

9. మే 5, 2011న డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 119 (56 బంతుల్లో 119; 13 ఫోర్లు, 6 సిక్సులు)

10. ఏప్రిల్ 24, 2008న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ సైమండ్స్ 117 నాటౌట్ (53 బంతుల్లో 117 నాటౌట్; 11 ఫోర్లు, 7 సిక్సులు)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When fans think of Twenty20 cricket what comes to their minds is only big hits from the willows of batsmen. The shortest format of the game is tailor-made to unleash sixes and fours.
Please Wait while comments are loading...