పదేళ్ల ఐపీఎల్: అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు, జాబితాలో తన్వీర్ ఫస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఐపీఎల్ పదో సీజన్ అభిమానులకు మరింత వినోదాన్ని పంచుతుంది. 2008లో ప్రారంభమైన ఈ క్యాష్ రిచ్ టోర్నీ భారతీయ క్రికెట్ అభిమానుల మదిని దోచుకుంది.

ఆయా రాష్ట్రాలకు చెందిన జట్లతో పాటు ఆటగాళ్లను క్రికెట్ అభిమానులు స్వాగతించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అతిరథ మహారధులను ఐపీఎల్ ఒక్క చోటుకి చేర్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఐపీఎల్ అంటే క్రికెట్ ఎంటర్టెన్మెంట్ అనేంతగా మారిపోయింది.

అభిమానులను ఆకర్షించేందుకు ఆటగాళ్లు సైతం తమ శక్తి వంచన లేకుండా ఫోర్లు, సిక్సులతో ఆకట్టుకునేవారు. ఐపీఎల్ అంటేనే రికార్డులు అనే మాదిరి టోర్నీ మారిపోయింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగే ఎన్నో మ్యాచ్‌లను ఐపీఎల్‌లో వీక్షించాం.

IPL 10: Here are 10 best bowling figures; Sohail Tanvir tops list

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్‌లో రాజస్ధాన్ రాయల్స్‌కు చెందిన పేసర్ సోహైల్ తన్వీర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6/14తో అద్భుత గణాంకాలను నమోదు చేశాడు. పదో సీజన్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నెలకొల్పిన వారి జాబితా మీకోసం.

ఏప్రిల్ 18, 2017 నాటికి ఐపీఎల్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నెలకొల్పిన టాప్ 10 బౌలర్లు:

1. మే 4, 2008న రాజస్ధాన్ రాయల్స్‌కు చెందిన సోహైల్ తన్వీర్ చెన్నై సూపర్ కింగ్స్‌పై 6/14 (4 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

2. మే 10, 2016న రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌కు చెందిన ఆడమ్ జంపా సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 6/19 (4 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

3. ఏప్రిల్ 18, 2009న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన అనిల్ కుంబ్లే రాజస్ధాన్ రాయల్స్‌పై 5/15 (3.1 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

4. ఏప్రిల్ 27, 2011న డెక్కన్ ఛార్జర్స్‌కు చెందిన ఇషాంత్ శర్మ కోచి టస్కర్స్‌పై 5/12 (3 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

5. ఏప్రిల్ 10, 2011న ముంబై ఇండియన్స్‌కు చెందిన లసిత్ మలింగ ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై 5/13 (3.4 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

6. ఏప్రిల్ 7, 2013న చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రవీంద్ర జడేజా డెక్కన్ ఛార్జర్స్‌పై 5/16 (4 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

7. మే 17, 2013న రాజస్ధాన్ రాయల్స్ ఆటగాడు జేమ్స్ ఫల్కనర్ సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 5/16 (4 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

8. మే 15, 2008న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా డెక్కన్ ఛార్జర్స్‌పై 5/17 (4 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

9. ఏప్రిల్ 14, 2017న ఢిల్లీ గుజరాత్ లయన్స్ ఆటగాడు ఆండ్రూ టై రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌పై 5/17 (4 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

10. ఏప్రిల్ 22, 2011న ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్‌పై 5/18 (4 ఓవర్లు) గణాంకాలను నమోదు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian Premier League (IPL) is undoubtedly the biggest cricket extravaganza in the country which has entered its 10th edition this time.
Please Wait while comments are loading...