పదేళ్ల ఐపీఎల్: ది బెస్ట్ కెప్టెన్ 'సూపర్ కింగ్' ధోనియే (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలో ఐపీఎల్ భారత్‌లోని అభిమానులను అలరించడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది.

ఈ లీగ్ ఎంత ఆదరణ పొందంటే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు సైతం ఈ లీగ్‌లో ఆడేందుకు పోటీ పడేలా. అంతేకాదు క్రికెటర్లకు ఆదాయం ఇచ్చే కల్పవృక్షంగా కూడా ఐపీఎల్ మారడం విశేషం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులో ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

2008లో ప్రారంభమైన ఐపీఎల్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠకుల కోసం ప్రత్యేకంగా వార్తలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంలో కెప్టెన్ పాత్ర ఎంతో కీలకం. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని మొదటి స్ధానంలో నిలిచాడు.

ఏప్రిల్ 18, 2017 నాటికి ఐపీఎల్‌లో టాప్ 10 అత్యుత్తమ కెప్టెన్ల జాబితా:

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

తొమ్మిది సీజన్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ పదో సీజన్‌లో మొట్టమొదటిసారి ఆటగాడిగా బరిలోకి దిగాడు. ఐపీఎల్ 2017 వేలానికి ముందు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ యాజమాన్యం ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. 2008 నుంచి 2016 వరకు ధోని కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 143 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. ధోని కెప్టెన్సీలోకి చెన్నై సూపర్ కింగ్స్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

గౌతం గంభీర్

గౌతం గంభీర్

ఐపీఎల్‌లో తొలుత ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడన గంభీర్ ఆ తర్వాత 2011లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఢిల్లీకి చెందిన గంభీర్ కోల్‌కతా జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. గంభీర్ నేతృత్వంలో కోల్‌కతా 2012లో మొట్టమొదటిసారి ఐపీఎల్ విజేతగా అవతరించింది. ఆ తర్వాత మళ్లీ 2014లో ఐపీఎల్ టైటిల్‌ను సాధించింది. కోల్ కతా జట్టు తరుపున టాపార్డర్‌లో ఆడుతున్న గంభీర్ 34 అర్ధసెంచరీలు చేశాడు. డేవిడ్ వార్నర్ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా గంభీర్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో గంభీర్ 112 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా అవతరించింది. దీంతో గంభీర్, ధోనిల సరసన రోహిత్ శర్మ నిలిచాడు. అయితే టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి మాత్రం ఐపీఎల్‌లో ఈ కోరికి ఇంకా నెరవేరలేదు. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 63 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమిండియాకు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు చేసినప్పటికీ బెంగళూరుని మాత్రం ఐపీఎల్ విజేతగా నిలబెట్టడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు కోహ్లీ 75 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో 37 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 33 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఆడమ్ గిల్ క్రిస్ట్

ఆడమ్ గిల్ క్రిస్ట్

ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2008 నుంచి 2013 వరకు కెప్టెన్‌గా కొనసాగాడు. గిల్ క్రిస్ట్ నేతృత్వంలోని డెక్కన్ ఛార్జర్స్ 2009 సీజన్‌లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్‌లో 74 మ్యాచ్‌లకు గాను 35 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 39 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో గిల్ క్రిస్ట్ విజయ శాతం 47.29గా ఉంది.

షేన్ వార్న్

షేన్ వార్న్

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు షేన్ వార్న్ రాజస్ధాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఫైనల్స్‌లో ధోని సేనపై విజయం సాధించి తొలి ఐపీఎల్ విజేతగా రాజస్ధాన్ రాయల్స్‌ను నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించాడు. 2008 నుంచి 2011 వరకు షేన్ వార్న్ 55 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో రాజస్ధాన్ రాయల్స్ 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 24 మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. ఐపీఎల్ కెప్టెన్‌గా షేన్ వార్న్ విజయ శాతం 55.45గా ఉంది.

డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. వార్నర్ నేతృత్వంలోని హైదరాబాద్ ఒక ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2013లో డేవిడ్వ వార్నర్ కెప్టెన్సీ బాద్యతలను స్వీకరించాడు. అంతకమందు ఐపీఎల్‌లో వార్నర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఇప్పటివరకు 39 గేమ్ లకు వార్నర్ నాయకత్వం వహించాడు. ఇందులో 22 గేముల్లో విజయం సాధించగా, 17 గేముల్లో పరాజయం పాలైంది. వార్నర్ విజయ శాతం 56.11గా ఉంది.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్

ఢిల్లీకి చెందిన వీరేంద్ర సెహ్వాగ్ 2008 నుంచి 2015 వరకు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో సెహ్వాగ్ మొత్తం 53 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 29 గేముల్లో విజయం సాధించగా, 24 గేముల్లో జట్టు పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో సెహ్వాగ్ విజయ శాతం 53.77గా ఉంది. సెహ్వాగ్ ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 2008 నుంచి 2011 వరకు కెప్టెన్‌గా ఉన్నాడు. సచిన్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం 51 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 21 మ్యాచ్‌ల్లో జట్టు పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో సచిన్ విజయ శాతం 58.82గా ఉంది.

రాహుల్ ద్రవిడ్

రాహుల్ ద్రవిడ్

టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లో బెంగళూరు, రాజస్ధాన్ రాయల్స్ జట్లకు 2008 నుంచి 2013 వరకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్ ఐపీఎల్‌లో రెండు జట్లు కలిపి 48 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్ కెప్టెన్సీలోని జట్టు 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 26 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో ద్రవిడ్ విజయ శాతం 45.83గా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's cricketing extravaganza Indian Premier League (IPL) has entered the 10th edition. Within a short span of a decade, IPL has transformed the game of cricket not only in India but also in the entire world.
Please Wait while comments are loading...