ఐపీఎల్‌లో మరో మైలురాయి: ఈడెన్‌లో గుజరాత్ ఘన విజయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా (46 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సులు), బ్రెండన్ మెక్ కల్లమ్ (17 బంతుల్లో 33; 5 ఫోర్లు, ఒక సిక్సు)తో రాణించారు.

గుజరాత్ విజయ లక్ష్యం 188

ఐపీఎల్‌లో పదో సీజన్‌లో భాగంగా గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్లలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ విజయ లక్ష్యం 188 పరుగులుగా నిర్దేశించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ సునీల్ నరైన్ (17 బంతుల్లో 42; 9 ఫోర్లు, 1 సిక్సర్)తో మెరుపులు మెరిపించగా, కెప్టెన్ గౌతం గంభీర్ (28 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్సర్)తో ఆకట్టుకున్నాడు.

Gujarat Lions win the toss and elect to field

రైనా బౌలింగ్‌లో ఫాల్కనర్‌కి క్యాచ్‌ ఇచ్చి నరైన్‌ వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోల్‌కతా తొలి వికెట్‌కు 57 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప (48 బంతుల్లో 72; 8 ఫోర్లు,2 సిక్సర్లు) తనదైన శైలిలో అలరించాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 69పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం 11.3వ ఓవర్‌ వద్ద ఫాల్కనర్‌ బౌలింగ్‌లో గంభీర్‌(33) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే 24 పరుగులు సాధించి థంపి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మనీష్ పాండే (21 బంతుల్లో 24; 2 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించాడు.

రాబిన్ ఊతప్ప, మనీశ్‌ జోడీ మూడో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కోల్‌కతా తరుపున 50వ మ్యాచ్‌ ఆడుతున్న రాబిన్ ఊతప్ప అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ప్రవీణ్‌ కుమార్‌ బౌలింగ్‌ మెకల్లమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఉతప్ప(72) వెనుదిరిగాడు.

చివరి ఓవర్‌ వేసిన థంపి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. లయన్స్‌ ఆటగాళ్లు ప్రవీణ్‌ కుమార్‌, ఫాల్కనర్‌, థంపి, రైనా తలో వికెట్‌ తీసుకున్నారు. రవీంద్ర జడేజా నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్ మరోసారి విజృంభించాడు. 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు.

Gujarat Lions win the toss and elect to field

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గుజరాత్ లయన్స్ తలపడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ గంభీర్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ సీజన్‌లో కోల్ కతా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించింది. ఇక గుజరాత్ లయన్స్ విషయానికి వస్తే ఐదు మ్యాచ్‌లు ఆడగా అందులో నాలుగింటిలో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే ఐపీఎల్‌ 600 మ్యాచ్‌ల మైలురాయిని చేరింది.

ఐపీఎల్‌లో మరో మైలురాయి

ఇండోర్‌లో గురువారం రాత్రి కింగ్స్ లెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ 600వ మ్యాచ్ కావడం విశేషం. టాస్‌ వేయకుండానే రద్దు అయిన ఆరు మ్యాచ్‌లను ఇందులో కలపలేదు. ఐపీఎల్ పదేళ్ల ప్రస్ధానంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 146 మ్యాచ్‌లు ఆడాయి.

తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లుగా నిలిచాయి. ఇక గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా అత్యధిక మ్యాచ్‌లు (152) ఆడిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక ఒకే జట్టు కోసం అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ పదేళ్లో కోహ్లీ 146 మ్యాచ్‌లు ఆడాడు.

జట్ల వివరాలు:
గుజరాత్ లయన్స్:
B McCullum, DR Smith, S Raina, A Finch, D Karthik, I Kishan, J Faulkner, R Jadeja, P Kumar, D Kulkarni, B Thampi

కోల్‌కతా నైట్ రైడర్స్:
G Gambhir, R Uthappa, M Pandey, S Al Hasan, Y Pathan, S Yadav, C Woakes, N Coulter-Nile, S Narine, U Yadav, K Yadav

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gujarat Lions win the toss and elect to field.
Please Wait while comments are loading...