క్రిస్ గేల్‌ను బోల్తా కొట్టించిన థంపి: భారత్‌కు ఆడతాడన్న బ్రావో

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కేరళకు చెందిన యువ పేసర్ బసిల్ థంపిపై వెస్టిండీస్ ఆల్‌ రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసలు కురిపించాడు. త్వరలోనే థంపి టీమిండియాకు ఆడతాడని బ్రావో అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో థంపి గుజరాత్ లయన్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు

ఐపీఎల్ పాయింట్ల పట్టిక

ఐపీఎల్ 2017 ఫోటోలు

'థంపి చాలా ప్రతిభ ఉన్న ఫాస్ట్ బౌలర్. ఒక ఏడాదిలోపే అతను భారత్ జట్టుకి ఆడతాడని నా నమ్మకం. అతని బౌలింగ్ తీరు.. బంతిని విసరడంలో నైపుణ్యం, వేగం చాలా బాగుంది. నేర్చుకునేందుకు అతను ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు' అని బ్రావో వివరించాడు.

రాజ్‌కోట్ వేదికగా మంగళవారం రాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడిన బెంగళూరు బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ని తెలివిగా యార్కర్‌తో ఔట్ చేసిన ఫాస్ట్ బౌలర్ థంపి పెవిలియన్‌కు చేర్చాడు. తన కెరీర్‌లో తొలిసారి ఐపీఎల్‌ ఆడుతున్న థంపి యార్కర్‌తో గేల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చకోవడం అందర్నీ ఆకట్టుకుంది.

IPL 2017: Basil Thampi will play for India soon, says Dwayne Bravo

గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా ఇన్నింగ్స్ 13వ ఓవర్ కోసం థంపి చేతికి బంతి ఇచ్చాడు. ఈ ఓవర్‌లో కూడా ధాటిగా ఆడేందుకు గేల్ ప్రయత్నించిన సమయంలో లెగ్‌వికెట్‌ని గురిపెట్టి థంపీ మూడో బంతిని యార్కర్‌గా విసరడంతో ఇబ్బంది పడిన గేల్.. తర్వాత మిడిల్ స్టంప్‌కి నేరుగా వచ్చిన బంతికి బోల్తొ కొట్టి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

అంతేకాదు ముంబై ఇండియన్స్‌ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో వరుసపెట్టి యార్కర్లు వేసి అందరినీ థంపి బాగా ఇంప్రెస్ చేశాడు. తొడ కండరాల గాయంతో బాధపడి.. ఇప్పుడే కోలుకుంటున్న బ్రావో వెంటనే థంపి వద్దకు వెళ్లి అభినందించాడు. థంపి ఎప్పుడూ సరైన ప్రశ్నలే అడుగుతుంటాడని, ఇలాంటి వాళ్లు ఉంటే భారత క్రికెట్ సరైన దిశలో వెళ్తుందని బ్రావో చెప్పాడు.

140 కిలోమీటర్లకు పైగా వేగంతో ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, థంపి లాంటివాళ్లు బౌలింగ్ చేయడం చాలా బాగుందని, వాళ్లకు తన హృదయపూర్వక అభినందనలని బ్రావో అన్నాడు. ప్రస్తుతం థంపి నేర్చుకునే దశలో ఉన్నాడని, మరిన్ని గేమ్స్‌ ఆడి మరింత అనుభవం పొందితే బాగా రాటు తేలుతాడని తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While Gujarat Lions haven’t had a good outing in this years IPL one bright spot for them has been the find of young Basil Thampi. He has grabbed the eyeballs of everyone around him and recently West Indian allrounder Dwayne Bravo heaped praise on him and said that he could soon represent India.
Please Wait while comments are loading...