ఈ క్యాచ్‌కే స్టోక్స్‌కు రూ. 14.5 కోట్లు ఇచ్చేయొచ్చు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ వరుస విజయాలను సాధించడంలో బెన్ స్టోక్స్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో బెన్ స్టోక్స్‌ను రూ. 14.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఆ డబ్బుకి బెన్ స్టోక్స్ న్యాయం చేస్తున్నాడనే దానికి ఈ ఒక్క క్యాచ్ నిదర్శనం. ఐపీఎల్ పదో సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ తరుపు నుంచి సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు బెన్ స్టోక్స్. అంతేకాదు అద్భుతమైన ఆటతీరుతో అందరినీ మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాడు.

Ben Stokes freak show leaves Delhi Daredevils stunned

ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏదైనా.. అతడి తర్వాతే ఎవరైనా అనేంతలా దుమ్ము దులిపేస్తున్నాడు. తాజాగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా శుక్రవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ చేసిన ఫీల్డింగ్ విన్యాసం అద్భుతమని చెప్పాలి. ఇన్నింగ్స్ 19.5 ఓవర్లో ఢిల్లీ బ్యాట్స్ ‌మెన్ షమీ భారీ షాట్ ఆడాడు.

అందరూ సిక్సర్ అనుకోగా.. బౌండరీ లైన్ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరిన స్టోక్స్ దాన్ని అందుకున్నాడు. కానీ గాల్లో ఎగురుతూనే బౌండరీ లైన్ దాటాడు. అయితే కింద కాలు పెట్టేలోగా.. బంతిని మైదానంలోకి ఎగరేసి.. తిరిగి బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్ అందుకున్నాడు.

స్టోక్స్ బంతి అందుకున్న తీరు చూసి షమీ సహా చూసిన వారందరూ నోరెళ్లబెట్టారు. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే మ్యాచ్‌లో ఆ తర్వాత ఢిల్లీ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా అదే తరహాలో ఫీల్డింగ్ చేశాడు.

జహీర్ బౌలింగ్ స్మిత్ ఆడిన షాట్‌ను గాల్లోకి ఎగిరి అందుకున్న అయ్యర్.. నేలపై కాలు పెట్టేలోగా బంతిని మైదానంలోకి విసిరేశాడు. కానీ తిరిగి అందుకోలేకపోయాడు. దీంతో స్మిత్ సిక్స్ బదులు ఒక్క పరుగుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో పూణెపై ఢిల్లీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ben Stokes has been the key to Rising Pune Supergiant's success in the 10th season of the Indian Premier League. Stokes on Friday left the Delhi Daredevils batsman Sanju Samson astonished with his superb direct hit.
Please Wait while comments are loading...