'యూనివర్స్ బాస్' జీవించే ఉన్నాడు: పదివేలపై గేల్ వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గుజరాత్ లయన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ విధ్వంసంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్రికెట్‌ అభిమానులను అలరిస్తుంటూనే ఉంటానని మ్యాచ్ అనంతరం వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌ మన్‌ క్రిస్ గేల్ చెప్పాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు

ఐపీఎల్ పాయింట్ల పట్టిక

ఐపీఎల్ 2017 ఫోటోలు

ఐపీఎల్‌లో తిరిగి పూర్వవైభవం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. గాయం కారణంగా డివిలియర్స్‌ ఆడడకపోవడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న క్రిస్ గేల్‌ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు సాధించాడు.

టీ20ల్లో 10 వేల పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా నిలవడం పట్ల సంతోషం కూడా వ్యక్తం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థంపీ బౌలింగ్‌లో నాలుగో ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీసి మూడు పరుగులు సాధించడంతో ఈ ఘనత సాధించాడు.

IPL 2017: Chris Gayle warns other teams, says the 'Universe Boss' is still here and alive

ఒకే ఒక్కడు: పదివేల పరుగుల క్లబ్‌లో క్రిస్ గేల్

'ఆ పేరు (యూనివర్స్ బాస్) అంటే ఎంతో ఇష్టం. అతడు మళ్లీ తిరిగి వచ్చాడు. అభిమానులు క్రిస్ గేల్ ఆటను చూడాలని అనుకంటున్నారు' అని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకున్న సందర్భంగా గేల్ చెప్పాడు. యూనివర్స్ బాస్ ఇక్కడే ఉన్నాడు, అది జీవించి ఉన్నాడని క్రిస్ గేల్ అన్నాడు.

'పదివేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 3 పరుగుల దూరంలో ఉన్నానని మ్యాచ్‌‌కు ముందు శామ్యూల్‌ బద్రీ గుర్తు చేశాడు. కచ్చితంగా రికార్డు సృష్టిస్తావని చెప్పాడు. నాక్కూడా మనసులో అదే ఉంది. ఈ లక్ష్యం సాధించాలని పిచ్చిగా కోరుకున్నా. ఈ ఘనత సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది' అని గేల్ తెలిపాడు.

ఫలితం మరోలా: మెక్‌కల్లమ్ క్యాచ్‌కి గేల్ అవుటై ఉంటే (వీడియో)

'టీ20ల్లో 10 వేల పరుగులు కొట్టిన తొలి బ్యాట్స్‌ మన్‌ గా నిలవడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన అభిమానుల, ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. మున్ముందు కూడా నా ఆటతో అభిమానులకు అలరించేందుకు ప్రయత్నిస్తాను' అని గేల్‌ చెప్పాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After powering Royal Challengers Bangalore (RCB) to a morale-boosting 21-run win over Gujarat Lions, self-proclaimed "UniverseBoss" Chris Gayle on Tuesday warned the other Indian Premier League (IPL) teams that "he is back".
Please Wait while comments are loading...