'మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరుకుంటాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌లో మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించి ప్లే ఆఫ్‌కు చేరుకుంటామని గుజరాత్ లయన్స్ ఆటగాడు ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు

చిన్నసామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్‌ ఫించ్‌ (34 బంతుల్లో 72) విధ్వంసం సృష్టించడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. [బెంగుళూరు VS గుజరాత్ స్కోరు కార్డు ]

IPL 2017: Confident of reaching play-offs, says GL's Aaron Finch

ఈ మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆరోన్ ఫించ్ మాట్లాడాడు. 'అవును. ఇప్పటికీ ఫ్లే ఆఫ్స్ పై నమ్మకముంది. గతేడాది తొలి ఏడు గేముల్లో ఆరింటిలో విజయం సాధించాం. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించాం. మిగిలిన ఆరు మ్యాచుల్లో ఐదు గెలవాల్సిన పరిస్థితి' అని చెప్పాడు.

'బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో మా జట్టు అద్భుతంగా రాణించింది. ఇదే తరహాలో మిగతా మ్యాచుల్లోనూ రాణిస్తే మా జట్టు తప్పకుండా ప్లే ఆఫ్‌కి చేరుకుంటుంది. తమ జట్టు ముందు ఉన్న సవాల్ ఇది. ఇప్పుడు మా దృష్టంతా ప్రతి మ్యాచ్‌లో విజయం ఎలా సాధించాలనే దానిపైనే' అని ఫించ్‌ తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gujarat Lions' (GL) star performer Aaron Finch is confident that their team can win five out of the next six matches to make it to the play-offs of the Indian Premier League (IPL) 2017 after comprehensively defeating Royal Challengers Bangalore (RCB).
Please Wait while comments are loading...