థ్యాంక్స్ చెప్పిన వార్నర్: పదో సీజన్‌లో రికార్డు, స్వదేశానికి పయనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ పోరు ముగిసింది. దీంతో చేసేదేమీ లేక సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఇంటిదారి పట్టారు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఎంతో చక్కగా గడిచిందని తమ పట్ల ఇంతటి అభిమానాన్ని కనబర్చిన ఫ్యాన్స్‌కు, ఫ్రాంచైజీకి ధన్యవాదాలు తెలుపుతూ సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్వదేశానికి బయల్దేరాడు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతాతో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పి డేవిడ్ వార్నర్ గురువారం ఫ్యామిలీతో సహా ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమయ్యాడు.

ధన్యవాదాలు తెలిపిన వార్నర్

ఈ సందర్భంగా ఈ రెండు నెలల పాటు తమకు అతిథ్యాన్ని ఇచ్చిన ఫ్రాంచైజీతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. 'గత కొన్ని నెలలుగా చక్కటి అతిథ్యాన్నిచ్చిన ఇండియాకు సన్‌రైజర్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. తమ శక్తిమేరకు పోరాడాం' అని వార్నర్ ట్వీట్ చేశాడు.

అభిమానుల మద్దతు అద్భుతం

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ అభిమానులు అందించిన మద్దతు మరిచిపోలేనిదని వార్నర్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో తన జర్నీని విజయవంతంగా ముగించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. 'ఇండియాలో మా సమయాన్ని గొప్పగా చేసినందుకు ప్రతి ఒక్క వ్యక్తికి ధన్యవాదాలు. దానిని ఎలా వర్ణించాలో తెలియడం లేదు' అని ట్వీట్ చేశాడు.

డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతా విజయం

డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతా విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏడు వికెట్లతో (డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతి) విజయం సాధించింది. ఐపీఎల్ పదో ‌సీజన్‌లో టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన సన్‌రైజర్స్‌.. కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 128 పరుగులు మాత్రమే చేసింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్‌ ముగిశాక వర్షం కారణంగా ఆటకు మూడున్నర గంటలు అంతరాయం కలిగింది. ఆ తర్వాత డక్‌వర్త్‌ ప్రకారం కోల్‌కతా లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు.

వార్నర్ రికార్డు

వార్నర్ రికార్డు

అనంతరం కోల్‌కతా కెప్టెన్ గంభీర్‌ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్‌‌గా రాణించడంతో కోల్‌కతా క్వాలిఫయర్‌-2 దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటివరకు 114 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 4014 పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా వార్నర్ మొదటి స్ధానంలో నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు, 36 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వార్నర్ తర్వాత ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా క్రిస్ గేల్(362), మూడో ఆటగాడిగా ఏబీ డివిలియర్స్ (3473)లు ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunrisers Hyderabad (SRH) captain David Warner thanked all the fans of the team for their support and also thanked India for the hospitality.
Please Wait while comments are loading...