పాండ్యా బ్ర‌ద‌ర్స్ కొట్లాట‌: ట్విట్టర్‌లో క్లాస్ తీసుకున్న సెహ్వాగ్‌, అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో పాండ్యా బ్రదర్స్ ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏమైందో తెలియ‌దుగానీ శనివారం కోల్‌కతాతో మ్యాచ్ ముగిసిన అనంతరం పాండ్యా బ్ర‌ద‌ర్స్ ట్విట్ట‌ర్ మాటల యుద్దానికి దిగారు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

తొలుత త‌మ్ముడు హార్దిక్ పాండ్యా ట్వీట్ చేశాడు. 'కొన్ని సార్లు జీవితంలో మ‌న‌కు చాలా ద‌గ్గ‌రా అనుకున్న‌వాళ్లే మ‌న‌ల్ని అసంతృప్తికి గురిచేస్తారు' అని హార్దిక్ పాండ్యా ట్వీట్ చేశాడు.

హార్దిక్ పాండ్యా ట్వీట్‌కు అన్న కృనాల్ పాండ్యా సైతం ట్విట్టర్ ద్వారానే స్పందించాడు. 'అస‌లు ఇది జ‌రగాల్సింది కాదు.. నేను నీ అన్న‌ను. ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలెయ్' అని కృనాల్ ట్వీట్ చేశాడు.

అయితే వీరిద్దరి ట్వీట్స్ చూసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్న‌ద‌మ్ములిద్ద‌రికీ క్లాస్ తీసుకున్నాడు. క్రికెటర్ల పట్టినరోజు నాడు పంచ్‌లేయ‌డంలో త‌న‌దైన మార్క్ చూపించే సెహ్వాగ్ వీళ్లిద్దరి మాటల యుద్ధంపై కూడా తనదైన స్టయిల్‌లో స్పందించాడు.

అయితే ఫ్యాన్స్ కూడా వీళ్లద్ద‌రి మాటల యుద్ధంపై కూడా అసంతృప్తి వ్య‌క్తంచేశారు. ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోండిగానీ.. ఇలా ట్విట్ట‌ర్‌ వేదికగా గొడవ పడటం ఏంటీ? అని ప్ర‌శ్నించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Pandya brothers of Mumbai Indians (MI), Hardik and Krunal were engaged in an altercation on Twitter today (May 14).
Please Wait while comments are loading...