ఎలిమినేటర్ హైలెట్స్: రికార్డు సృష్టించిన వార్నర్, డక్‌వర్త్‌-లూయిస్‌‌లో కోల్‌కతా విజయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌ పదో సీజన్‌లో సన్‌రైజర్స్‌ పోరాటం ముగించింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏడు వికెట్లతో (డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతి) విజయం సాధించింది. గంభీర్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్‌) రాణించడంతో కోల్‌కతా క్వాలిఫయర్‌-2 దూసుకెళ్లింది.

కొంపముంచిన వర్షం: ఐపీఎల్ నుంచి సన్‌రైజర్స్ ఔట్, క్వాలిఫయర్‌-2కు కోల్‌కతా

ఐపీఎల్ పదో ‌సీజన్‌లో టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన సన్‌రైజర్స్‌.. కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 128 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్‌ ముగిశాక వర్షం కారణంగా ఆటకు మూడున్నర గంటలు అంతరాయం కలిగింది. ఆ తర్వాత డక్‌వర్త్‌ ప్రకారం కోల్‌కతా లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు.

రాత్రి 12:55 గంటలకు ఆట మొదలైంది. లక్ష్య ఛేదనలో క్రిస్‌ లిన్‌ (6), రాబిన్‌ ఊతప్ప(1), యూసుఫ్‌ పఠాన్‌(0) త్వరగానే అవుటైనా.. కెప్టెన్‌ గంభీర్‌ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ విజయంతో గతేడాది ఎలిమినేటర్‌లో రైజర్స్‌ చేతిలో ఎదురైన పరాభవానికి కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంది.

శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2లో ముంబైతో కోల్‌కతా తలపడనుంది. కోల్ కతా విజయ లక్ష్యం 36 బంతుల్లో 48. అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కోల్‌కతాకు పెద్ద కష్టమేమీ కాదనిపించింది. అయితే, టోర్నీలో అత్యంత నాణ్యమైన బౌలింగ్‌ని కలిగి ఉన్న హైదరాబాద్‌ వైపు కూడా విజయావకాశాలు కనిపించాయి.

IPL 2017: Eliminator Highlights: Kolkata Vs Hyderabad; KKR win by D/L method

దీనికి తోడు వర్షం కారణంగా పిచ్ తేమగా ఉంది. ఈ క్రమంలో వర్షం అనంతరం మ్యాచ్ ప్రారంభమైంది. ఇన్నింగ్స్‌ రెండో బంతినే సిక్సర్‌గా మలిచిన కోల్‌కతా ఓపెనర్‌ క్రిస్‌ లిన్ (6)ను ఆ తర్వాతి బంతికే భువనేశ్వర్ కుమార్ అవుట్‌ చేశాడు. ఆ మరుసటి బంతికి యూసుఫ్‌ పఠాన్ (0) రనౌటయ్యాడు.

ఇక, సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన క్రిస్‌ జోర్డాన్ తన తొలి బంతికే రాబిన్‌ ఊతప్ప (1)ను పెవిలియన్‌ చేర్చడంతో నైట్‌ రైడర్స్‌ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో హైదరాబాద్‌ అద్భుతం చేసేలా కనిపించింది. కానీ, అదే ఓవర్‌ ఐదో బంతికి కెప్టెన గంభీర్‌ సిక్సర్‌ రాబట్టాడు.

మూడో ఓవర్లో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్ ఆరు పరుగులే ఇవ్వడంతో కోల్ కతా విజయానికి 18 బంతుల్లో 21 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ, కౌల్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన గంభీర్‌ మ్యాచ్‌ని ఏకపక్షం చేసేశాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే కోల్‌కతా లక్ష్యాన్ని చేరుకుంది. [స్కోరు కార్డు ]

కోల్‌కతా నైట్‌రైడర్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ హైలెట్స్:

* వర్షం కారణంగా డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతాకు 6 ఓవర్లకు గాను 48 పరుగులు నిర్ణయించారు.
* ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో క్రిస్ లిన్, యూసఫ్ పఠాన్‌లను భువీ అవుట్ చేసి మ్యాచ్‌పై ఆశలు రేపాడు.
* 6 పరుగుల వద్ద కీపర్ నోమన్ ఓజాకు క్యాచ్ ఇచ్చి క్రిల్ లిన్ వెనుదిరిగాడు.
* భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో యూసఫ్ పఠాన్ రనౌట్ అయ్యాడు.
* ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో రాబిన్ ఊతప్ప పెవిలియన్‌కు చేరాడు.
* 12 పరుగలకే కోల్ కతా 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన గంభీర్ 19 బంతుల్లో 32 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు.
* ఈ సీజన్‌లో ఇషాంత్ జగ్గీ తొలి మ్యాచ్ ఆడాడు.
* శుక్రవారం క్వాలిఫియర్ 2లో జరిగే మ్యాచ్‌లో కోల్ కతా, ముంబైతో తలపడనుంది.
* గతేడాది జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్ కతాను సన్ రైజర్స్ ఓడించింది. ఈ విజయంతో గతేడాది ఎలిమినేటర్‌లో రైజర్స్‌ చేతిలో ఎదురైన పరాభవానికి కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంది.
* ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా అర్ధసెంచరీ చేయలేకపోయారు.
* సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
* ఐపీఎల్‌లో 4000 పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు, మొత్తంగా ఐదో ఆటగాడు.
* కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్‌లు రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* కేన్ విలియమ్సన్ 26 బంతుల్లో 24 పరుగులు చేశాడు. నాథన్ కౌల్టర్-నైలీ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ పెవిలియన్‌కు చేరాడు.
* పియూష్ చావ్లా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ 37 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
* ఐపీఎల్ పదో సీజన్‌లో డేవిడ్ వార్నర్ (641) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
* ఐపీఎల్ పదో సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా భువనేశ్వర్ కుమార్ (26) నిలిచాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Skipper Gautam Gautam guided Kolkata Knight Riders to a 7-wicket win against Sunrisers Hyderabad in a rain curtailed Indian Premier League (IPL) 2017 Eliminator encounter here on Thursday (May 18).
Please Wait while comments are loading...