కొంపముంచిన వర్షం: ఐపీఎల్ నుంచి సన్‌రైజర్స్ ఔట్, క్వాలిఫయర్‌-2కు కోల్‌కతా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌ పదో సీజన్‌లో సన్‌రైజర్స్‌ పోరాటం ముగించింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏడు వికెట్లతో (డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతి) విజయం సాధించింది. గంభీర్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్‌) రాణించడంతో కోల్‌కతా క్వాలిఫయర్‌-2 దూసుకెళ్లింది.

Kolkata Knight Riders win the toss and elect to field

ఐపీఎల్ పదో ‌సీజన్‌లో టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన సన్‌రైజర్స్‌.. కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 128 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్‌ ముగిశాక వర్షం కారణంగా ఆటకు మూడున్నర గంటలు అంతరాయం కలిగింది. ఆ తర్వాత డక్‌వర్త్‌ ప్రకారం కోల్‌కతా లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు.

రాత్రి 12:55 గంటలకు ఆట మొదలైంది. లక్ష్య ఛేదనలో క్రిస్‌ లిన్‌ (6), రాబిన్‌ ఊతప్ప(1), యూసుఫ్‌ పఠాన్‌(0) త్వరగానే అవుటైనా.. కెప్టెన్‌ గంభీర్‌ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ విజయంతో గతేడాది ఎలిమినేటర్‌లో రైజర్స్‌ చేతిలో ఎదురైన పరాభవానికి కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంది.

శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2లో ముంబైతో కోల్‌కతా తలపడనుంది. కోల్ కతా విజయ లక్ష్యం 36 బంతుల్లో 48. అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కోల్‌కతాకు పెద్ద కష్టమేమీ కాదనిపించింది. అయితే, టోర్నీలో అత్యంత నాణ్యమైన బౌలింగ్‌ విభాగం ఉండడంతో హైదరాబాద్‌కూ అవకాశాలు కనిపించాయి.

పైగా, వర్షంతో పిచ్‌పై తేమ ఉంది. ఇన్నింగ్స్‌ రెండో బంతినే సిక్సర్‌గా మలిచిన కోల్‌కతా ఓపెనర్‌ క్రిస్‌ లిన్ (6)ను ఆ తర్వాతి బంతికే భువనేశ్వర్ కుమార్ అవుట్‌ చేశాడు. ఆ మరుసటి బంతికి యూసుఫ్‌ పఠాన్ (0) రనౌటయ్యాడు. ఇక, సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన క్రిస్‌ జోర్డాన్ తన తొలి బంతికే రాబిన్‌ ఊతప్ప (1)ను పెవిలియన్‌ చేర్చడంతో నైట్‌ రైడర్స్‌ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

Kolkata Knight Riders win the toss and elect to field

దీంతో హైదరాబాద్‌ అద్భుతం చేసేలా కనిపించింది. కానీ, అదే ఓవర్‌ ఐదో బంతికి కెప్టెన గంభీర్‌ సిక్సర్‌ రాబట్టాడు. మూడో ఓవర్లో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్ ఆరు పరుగులే ఇవ్వడంతో కోల్ కతా విజయానికి 18 బంతుల్లో 21 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ, కౌల్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన గంభీర్‌ మ్యాచ్‌ని ఏకపక్షం చేసేశాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే కోల్‌కతా లక్ష్యాన్ని చేరుకుంది.


బెంగళూరు వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును ఛేజింగ్ ప్రారంభించనీయకుండా వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం మొదలవ్వడంతో చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌పై కవర్స్‌ కప్పారు.

ఇప్పుడు వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదానంలో ఉన్న కవర్స్‌ను తొలగించేందుకు గ్రౌండ్ స్టాఫ్ ప్రయత్నిస్తున్నారు. మళ్లీ వర్షం మొదలుకాకుంటే 11 గంటల 25 నిమిషాలకు 20 ఓవర్ల మ్యాచ్‌నే కొనసాగించనున్నారు. ఈ మేరకు అంఫైర్లు నిర్ణయం తీసుకున్నారు.

వర్షంతో నిలిచిన మ్యాచ్, సన్‌రైజర్స్‌ను విజేతగా ప్రకటించే అవకాశం

బెంగళూరు వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.

అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును ఛేజింగ్ ప్రారంభించనీయకుండా వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం మొదలవ్వడంతో చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌పై కవర్స్‌ కప్పారు. వరుణుడు కరుణిస్తే ఓవర్లు కుదించి మ్యాచ్‌ కొనసాగించే అవకాశం ఉంది.

Kolkata Knight Riders win the toss and elect to field

* 11:50 లోపు వరుణుడు కరుణించి మైదానం సిద్ధంగా ఉంటే 20 ఓవర్ల మ్యాచ్‌ నిర్వహిస్తారు.
* 12:58 వరకు మ్యాచ్‌ నిర్వహించడానికి వీలుంటే 5 ఓవర్ల మ్యాచ్‌ నిర్వహిస్తారు. అప్పుడు కోల్‌కతా లక్ష్యం 41 పరుగులుగా నిర్ణయించారు.
* ఒకవేళ 1:20 వరకు పరిస్థితులు అనుకూలిస్తే సూపర్‌ ఓవర్‌ నిర్వహించి విజేతను తేలుస్తారు.
* మ్యాచ్‌ రద్దైయితే సన్‌రైజర్స్‌ విజేతగా నిలువనుంది.

ఐపీఎల్ పదో సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌కి ఎలాంటి రిజర్వ్ డే లేదు. కాబట్టి.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు.

Kolkata Knight Riders win the toss and elect to field

టోర్నీ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు 8 మ్యాచ్‌ల్లో గెలుపొంది.. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో బెంగళూరుతో కలిసి పాయింట్ పంచుకుని 17 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు 8 విజయాలు మాత్రమే సాధించిన కోల్‌కతా 16 పాయింట్లో నాలుగో స్థానంలో నిలిచింది. కాబట్టి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ విజేతగా నిలుస్తుంది.

కోల్‌కతా విజయ లక్ష్యం 129

బెంగళూరు వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతాకు 129 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్‌కు ఆదిలోనే ధావన్(11) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రారంభం నుంచి నెమ్మదిగా ఆడిన సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ఏదశలో బ్యాట్‌తో సత్తా చాటలేకపోయారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి సన్ రైజర్స్ వికెట్ కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది.

ఆ తర్వాత సన్‌రైజర్స్ ఆటగాళ్లు వార్నర్-విలియమ్సన్ జోడి దూకుడు పెంచినప్పటికీ భారీ స్కోరు సాధించలేకపోయింది. నాథన్ కౌల్టర్ నిలే బౌలింగ్‌లో విలియమ్సన్(24) పరుగుల వద్ద క్యాచ్ రూపంలో అవుటవ్వగా, వెంటనే వార్నర్(37) పీయుష్ చావ్లా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మన్ నిలదొక్కుకోలేకపోయారు. కీలక మ్యాచ్ ‌యువరాజ్‌ సింగ్‌ (9) నిరాశపరిచాడు. విజయ్ శంకర్(22) వేగంగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ నాథన్ కౌల్టర్ నిలే బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

అదే ఓవర్‌లో క్రిస్ జోర్డాన్ డకౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నమాన్ ఓజా (16) చివరి బంతికి క్యాచ్‌గా అవుటయ్యాడు. సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (35 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సులు)తో టాప్‌ స్కోరర్‌‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో నాథన్ కౌల్టర్ నిలే మూడు, ఉమేశ్ యాదవ్ రెండు, ట్రెంట్ బౌల్ట్, పియూష్ చావ్లా చెరో వికెట్ తీశారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ఐపీఎల్ పదో సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

గాయం కారణంగా మనీశ్‌పాండే ఈ మ్యాచ్‌ ఆడడం లేదని గంభీర్ చెప్పాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, పీయూష్‌ చావ్లా, కౌల్టర్‌నైల్‌, జగ్గీని కోల్‌కతా తుది జట్టులో తీసుకున్నారు. ఇక సన్‌రైజర్స్‌లో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తిరిగొచ్చాడు. క్రిస్‌ జోర్డాన్‌, విలియమ్సన్‌, బిపుల్‌శర్మను తుదిజట్టులో చోటు కల్పించారు.

దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి క్వాలిఫయిర్-2కు అర్హత సాధించాలని ఇరుజట్లు ఊవిళ్లూరుతున్నాయి. లీగ్‌ దశలో రెండు జట్లూ సమాన విజయాలు (8) సాధించాయి. ముఖాముఖి పోరులో చెరో మ్యాచ్‌ గెలిచాయి.

IPL 2017: Eliminator (Match 58): Kolkata Knight Riders win the toss and elect to field

బలాబలాలు కూడా దాదాపు సమానంగానే ఉన్నాయి. అందుకే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఫలానా జట్టే ఫేవరెట్‌ అని చెప్పడం కష్టంగా ఉంది. హైదరాబాద్‌ బౌలింగ్‌లో బలంగా కనిపిస్తుంటే.. కోల్‌కతా బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

గెలిచిన జట్టు క్వాలిఫియర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో 19వ తేదీన తలపడుతుంది.

జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:
D Warner, S Dhawan, K Williamson, Y Singh, V Shankar, N Ojha, C Jordan, B Sharma, B Kumar, R Khan, S Kaul

కోల్‌కతా నైట్‌రైడర్స్:
S Narine, C Lynn, G Gambhir, R Uthappa, Y Pathan, S Yadav, I Jaggi, P Chawla, U Yadav, N Coulter-Nile, T Boult

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kolkata Knight Riders win the toss and elect to field.
Please Wait while comments are loading...