యువీపై అనుమానం: 'ఫిట్‌నెస్ పరీక్ష ఫలితాన్ని బట్టే ఆడతాడు'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఫిట్‌నెస్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు 

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్ కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ మంగళవారం మీడియాతో మాట్లాడాడు.

SRH's Yuvraj Singh to undergo fitness test

మంగళవారం సాయంత్రం ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోబోతున్నాడని మూడీ వెల్లడించాడు. ఫలితాన్ని బట్టే అతడు మ్యాచ్‌ ఆడతాడో లేదో చెప్పగలమని తెలిపాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా యువీ చిటికెన వేలికి తీవ్రగాయమైన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత కాన్పూర్ వేదికగా గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కి గాయం కారణంగా యువరాజ్ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో యువీ ఫిట్‌నెస్‌ పరీక్షల్ని ఎదుర్కొంటాడని, ఫిట్‌గా ఉన్నట్లు తేలితే తుది జట్టులో ఖచ్చితంగా ఆడతాడని కోచ్‌ టామ్‌ మూడీ చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. గతేడాది కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్‌లో యువరాజ్ 44 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఫిట్‌నెస్‌ లేమి కారణంగా సన్ రైజర్స్ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా టోర్నీలో తర్వాత మ్యాచ్‌లు ఆడడని కోచ్‌ టామ్‌ మూడీ ప్రకటించాడు.

నెహ్రా ఔట్: ప్లేఆఫ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు గట్టి షాక్‌

ఇదిలా ఉంటే జూన్ 1 నుంచి 18 వరకు లండన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి బీసీసీఐ ఎంపికైన పదిహేను మంది జట్టు సభ్యుల్లో యువరాజ్‌ సింగ్‌ కూడా ఉన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ace Sunrisers Hyderabad (SRH) batsman Yuvraj Singh will undergo a fitness test ahead of their eliminator match against Kolkata Knight Riders (KKR) in IPL 2017.
Please Wait while comments are loading...