ఢిల్లీపై రెచ్చిపోయిన విలియమ్సన్: ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కేన్ విలియమ్సన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఈ సీజన్‌ ఆరంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ ఢిల్లీపై విశ్వరూపం ప్రదర్శించాడు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు స్కోరు 12 పరుగులు వద్ద రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (4) వికెట్‌ కోల్పోయింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌, మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌‌తో కలిసి చక్కటి శుభారంభాన్నిచ్చాడు. ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 33 బంతుల్లో విలియమ్సన్ అర్ద సెంచరీ పూర్తి చేయగా ధావన్ 40 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు.

పవర్‌ప్లేలో నిదానంగా ఆడుతూ వచ్చిన వీరిద్దరూ ఆపై ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ వచ్చారు. 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 89 పరుగులు చేసిన విలయమ్సన్ క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. రెండో వికెట్‌కు విలియమ్సన్, ధావన్‌లు 136 పరుగుల జోడించారు.

భారీ షాట్లు ఆడే క్రమంలో విలియమ్సన్‌ క్రిస్‌ మోరీస్‌ వేసిన 17వ ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం స్వల్ప వ్యవధిలోనే 19వ ఓవర్‌లో శిఖర్‌ ధావన్‌ కూడా క్రిస్‌ మోరీస్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

విలియమ్సన్ ఇన్నింగ్స్‌పై ట్విట్టర్‌లో ఇలా:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunrisers Hyderabad (SRH) star Kane Williamson played a fantastic innings of 89 runs off just 51 balls against Delhi Daredevils in the match 21 of IPL 2017.
Please Wait while comments are loading...