న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2017: ఆరెంజ్ క్యాప్ వార్నర్‌‌దే, ఐపీఎల్ అవార్డుల పూర్తి వివరాలు

హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ పదో సీజన్ పైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు

By Nageshwara Rao

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ పదో సీజన్ పైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఐపీఎల్ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. పదో సీజన్‌లో టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.

మరోవైపు గెలుపు అంచువరకు వచ్చిన పూణె చివర్లో చతికిల పడింది. 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె చివర్లో ఒత్తిడికి గురై వికెట్లను చేజార్చుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఓటమి పాలైంది.

దీంతో ఐపీఎల్ పదో సీజన్ మహా సంగ్రామం ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోగా, అదే జట్టుకు చెందిన పేసర్ భువనేశ్వర్ కుమార్ పర్పెల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్ అవార్డు విజేతలు:

IPL 2017 Winner - Mumbai Indians (MI)

IPL 2017 Winner - Mumbai Indians (MI)

ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ రూ. 15 కోట్ల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని సొంతం చేసుకుంది. ముంబై ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా మెమెంటోలను అందుకున్నారు.

గత విజేతలు:

2008 - Rajasthan Royals (RR)

2009 - Deccan Chargers (DC)

2010 - Chennai Super Kings (CSK)

2011 - CSK

2012 - Kolkata Knight Riders (KKR)

2013 - Mumbai Indians (MI)

2014 - KKR

2015 - MI

2016 - Sunrisers Hyderabad (SRH)

Runner-up - Rising Pune Supergiant (RPS)

Runner-up - Rising Pune Supergiant (RPS)

రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 10 కోట్లతో పాటు ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా మెమెంటోలను అందుకున్నారు.

Previous losing finalists

2008 - Chennai Super Kings (CSK)

2009 - Royal Challengers Bangalore (RCB)

2010 - Mumbai Indians (MI)

2011 - RCB

2012 - CSK

2013 - CSK

2014 - Kings XI Punjab (KXIP)

2015 - CSK

2016 - RCB

Orange Cap (Most runs in tournament) - David Warner (SRH)

Orange Cap (Most runs in tournament) - David Warner (SRH)

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 641 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్ లాడిన డేవిడ్ వార్నర్ నాలుగు అర్ధసెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. ఈ అవార్డు కింద వార్నర్‌కు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ లభించనుంది.

Previous winners

2008 - Shaun Marsh (KXIP) - 616 runs

2009 - Matthew Hayden (CSK) - 572

2010 - Sachin Tendulkar (MI) - 618

2011 - Chris Gayle (RCB) - 608

2012 - Chris Gayle (RCB) - 733

2013 - Michael Hussey (CSK) - 733

2014 - Robin Uthappa (KKR) - 660

2015 - David Warner (SRH) - 562

2016 - Virat Kohli (RCB) - 973

Purple Cap (Most wickets in tournament) - Bhuvneshwar Kumar (SRH)

Purple Cap (Most wickets in tournament) - Bhuvneshwar Kumar (SRH)

ఐపీఎల్ పదో సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లకు ఇచ్చే పర్పెల్ క్యాప్‌ని సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సొంతం చేసుకున్నాడు. 14 మ్యాచ్‌లాడిన భువీ 26 వికెట్లు తీసుకుని అగ్రస్ధానంలో నిలిచాడు. భువీకి వరుసగా ఇది రెండో పర్పెల్ క్యాప్ కావడం విశేషం. గత సీజన్‌లో 23 వికెట్లు తీసుకుని సన్ రైజర్స్ ఐపీఎల్ విజేతగా నిలవడంతో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ అవార్డు కింద భువీకి రూ.10 లక్షలతో పాటు ట్రోఫీ అందుకున్నాడు.

Previous winners

2008 - Sohail Tanvir (RR) - 22 wickets

2009 - RP Singh (DC) - 23

2010 - Pragyan Ojha (DC) - 23

2011 - Lasith Malinga (MI) - 28

2012 - Morne Morkel (DD) - 25

2013 - Dwayne Bravo (CSK) - 32

2014 - Mohit Sharma (CSK) - 23

2015 - Dwayne Bravo (CSK) - 26

2016 - Bhuvneshwar Kumar (SRH) - 23

YES Bank Maximum Season Award (Most sixes in tournament) - Glenn Maxwell (Kings XI Punjab)

YES Bank Maximum Season Award (Most sixes in tournament) - Glenn Maxwell (Kings XI Punjab)

13 ఇన్నింగ్స్‌ల్లో పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ 26 సిక్సులు బాదాడు. వార్నర్ కూడా 26 సిక్సులు బాదినప్పటికీ, మ్యాక్స్ వెల్ ఎక్కువ దూరంలో రెండు పెద్ద సిక్సులను బాదడంతో ఈ అవార్డుని మ్యాక్స్ వెల్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కింద భువీకి రూ.10 లక్షలతో పాటు ట్రోఫీ అందుకున్నాడు.

Vodafone Superfast Fifty Award - Sunil Narine (KKR)

Vodafone Superfast Fifty Award - Sunil Narine (KKR)

వోడాఫోన్ సూపర్‌ ఫాస్ట్‌ 50 అవార్డుని సునీల్‌ నరైన్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌) అందుకున్నాడు. ఈ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై నరైన్‌ 15బంతుల్లో అర్థ శతకం బాదాడు. ఈ అవార్డు కింద భువీకి రూ.10 లక్షల నగదుతో పాటు ట్రోఫీ అందుకున్నాడు.

Vitara Brezza Glam Shot of the Season - Yuvraj Singh (SRH)

Vitara Brezza Glam Shot of the Season - Yuvraj Singh (SRH)

షాట్‌ ఆఫ్‌ ద సీజన్‌ అవార్డుని యువరాజ్‌ సింగ్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) అందుకున్నాడు. ఈ అవార్డు కింద రూ.10లక్షల నగదుతో పాటు ఒక కారును యువీ సొంతం చేసుకున్నాడు. అతని తరఫున మహమ్మద్‌ సిరాజ్‌ ఈ అవార్డును అందుకున్నాడు.

FBB Stylish Player of the Season - Gautam Gambhir (KKR)

FBB Stylish Player of the Season - Gautam Gambhir (KKR)

ఐపీఎల్ పదో సీజన్‌లో స్టైలిష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ అవార్డుని గౌతమ్‌ గంభీర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌) అందుకున్నాడు. గంభీర్‌ తరఫున ఈ అవార్డును ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు నితీశ్‌ రాణా అందుకున్నాడు. ఈ అవార్డు కింద రూ.10లక్షల నగదు పాటు ట్రోఫీ లభించింది.

Fair Play Award - Gujarat Lions (GL)

Fair Play Award - Gujarat Lions (GL)

ఐపీఎల్ పదో సీజన్‌లో ఫెయిర్‌ ప్లే అవార్డుని గుజరాత్‌ లయన్స్‌ జట్టు అందుకుంది. 14 మ్యాచుల్లో 4విజయాలు నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచినప్పటికీ అభిమానులు ఫెయిర్‌ ప్లే అవార్డును గుజరాత్‌ లయన్స్‌కే కట్టబెట్టారు.

Emerging Player Award - Basil Thampi (GL)

Emerging Player Award - Basil Thampi (GL)

ఈ సీజన్‌లో ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డుని బసిల్‌ థంపి(గుజరాత్‌ లయన్స్‌) అందుకున్నాడు. ఈ సీజన్‌లో థంపి 12మ్యాచుల్లో 11వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

Most Valuable Player - Ben Stokes (RPS)

Most Valuable Player - Ben Stokes (RPS)

ఈ సీజన్‌లో మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ అవార్డుని బెన్‌ స్టోక్స్‌ (రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌) దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో స్టోక్స్‌ 316 పరుగులతో పాటు 12వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో స్టోక్స్‌ అత్యధికంగా రూ.14.5కోట్లు పలికిన సంగతి తెలిసిందే.

గత విన్నర్లు

2008 - Shane Watson (RR)

2009 - Adam Gilchrist (DC)

2010 - Jacques Kallis (RCB)

2011 - Chris Gayle (RCB)

2012 - Chris Gayle (RCB)

2013 - Shane Watson (RR)

2014 - Glenn Maxwell (KXIP)

2015 - Andre Russel (KKR)

2016 - Virat Kohli (RCB)

Pitch and Ground Awards - Punjab Cricket Association (PCA), Mumbai Cricket Association (MCA) and Cricket Association of Bengal (CAB)

Pitch and Ground Awards - Punjab Cricket Association (PCA), Mumbai Cricket Association (MCA) and Cricket Association of Bengal (CAB)

ఐపీఎల్ పదో సీజన్‌లో పిచ్‌, గ్రౌండ్‌ అవార్డులను పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ సొంతం చేసుకున్నాయి.

ప్రైజ్‌మనీ: వాంఖడే రూ.50లక్షలు

ఈడెన్‌గార్డెన్స్‌: రూ.50లక్షలు

మొహాలి: రూ.25లక్షలు

ఏడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన మైదానానికి రూ.50లక్షలు ఇవ్వగా... ఏడుకన్నా తక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన మొహాలికి రూ.25లక్షలు అందజేశారు.

VIVO Perfect Catch of the Season - Suresh Raina

VIVO Perfect Catch of the Season - Suresh Raina

వివో ఫర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌ అవార్డుని సురేశ్‌ రైనా (గుజరాత్‌ లయన్స్‌) అందుకున్నాడు. ఈ అవార్డు కింద రూ.10లక్షలు, వివో ఫోను దక్కించుకున్నాడు.

Man of the match in the final - Krunal Pandya (MI)

Man of the match in the final - Krunal Pandya (MI)

ఫైనల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్న ఆటగాడిగా కృనాల్‌ పాండ్యా (ముంబయి ఇండియన్స్‌) నిలిచాడు

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X