ఫైన్ లెగ్‌లో కళ్లు చెదిరే క్యాచ్: ఉనాద్కత్ పట్టాడిలా (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ భాగంగా ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠకి తెరదించుతూ రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ప్లేఆఫ్ చేరింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై పూణె 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు 

ఈ మ్యాచ్‌లో పూణె బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ అద్భుత ప్రదర్శన చేశాడు. అటు బౌలింగ్‌తో పాటు కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్‌ మార్టిన్ గుప్తిల్‌ని అవుట్ చేసిన పంజాబ్‌ని ఒత్తిడిలోకి నెట్టాడు.

అనంతరం 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెరుపు ఫీల్డింగ్‌తో ఇయాన్ మోర్గాన్‌ని రనౌట్ చేశాడు. సౌరాష్ట్రకు చెందిన ఉనాద్కత్ శ్రాద్ధుల్ ఠాకూర్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాను పెవిలియన్‌కు పంపిన క్యాచ్ క్రికెట్ అభిమానుల ప్రశంసలందుకుంటోంది. 5.1 ఓవర్ వద్ద పవర్ ప్లేలో నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత వెను వెంటనే వికెట్లను కోల్పోయింది.

నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న తెవాటియా ఇచ్చిన క్యాచ్‌ని కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేస్తూ అందుకోవడమే కాకుండా.. చివర్లో స్వప్నిల్ సింగ్ వికెట్ తీసి పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 15.5 ఓవర్లలోనే 73 పరుగులకు కుప్పకూలిపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rising Pune Supergiant speedster Jaydev Unadkat is the man on fire during their final league encounter in the Indian Premier League (IPL) 2017 against Kings XI Punjab on Sunday (May 14).
Please Wait while comments are loading...