పూణెకు ఎదురుదెబ్బ: స్టోక్స్ దూరం, ఈసీబీ కావాలనే అలా (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరి మంచి ఊపు మీద ఉన్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పదో సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అత్యధిక ధర పెట్టి మరీ దక్కించుకున్న ఆ జట్టు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

బెన్ స్టోక్స్‌ను ఉన్నపళంగా వచ్చేయమంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) హెచ్చరిక జారీ చేయడంతో అతను స్వదేశానికి పయనం కానున్నాడు. స్టోక్స్ ప్లేఆఫ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని పంజాబ్‌తో మ్యాచ్‌ అనంతరం విలేకరుల సమావేశంలో పుణె కెప్టెన్‌ స్మిత్‌ ఈ విషయం చెప్పాడు.

పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో పూణె ఘన విజయం

పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో పూణె ఘన విజయం

ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 9వికెట్ల తేడాతో విజయం సాధించిన పుణె పాయింట్ల పట్టికలో రెండో స్థానం స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ భారీ విజయంపై స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఈ విజయంతో చాలా ఆనందంగా ఉన్నాం. బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు' అని తెలిపాడు.

సంతృప్తి వ్యక్తం చేసిన స్టీవ్ స్మిత్

సంతృప్తి వ్యక్తం చేసిన స్టీవ్ స్మిత్

'ఈ లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ముగిసే వరకూ ఆటగాళ్ల కోసం అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలువురు కొత్త ఆటగాళ్లకు వెలుగులోకి వచ్చారు. దాంతో మా జట్టు సమతుల్యంగా తయారైంది. రెండో విడత మ్యాచ్ ల్లో మా జట్టు అనేక మంచి విజయాల్ని సొంతం చేసుకుంది' అని జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.

ప్లేఆఫ్‌కి బెన్ స్టోక్స్ దూరం

ప్లేఆఫ్‌కి బెన్ స్టోక్స్ దూరం

'జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో స్టోక్స్ స్వదేశానికి వెళ్లనున్నాడు. ప్లేఆఫ్‌కి స్టోక్స్‌ సేవలు కోల్పోవడం చాలా దురదృష్టకరం, అతని లేని లోటు తీర్చలేనిది. స్టోక్స్‌ స్థానం భర్తీ చేయడం కోసం ఒకరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రిజర్వ్ బెంచ్‌లో మా జట్టు మెరుగ్గానే ఉంది. దాంతో స్టోక్స్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతాం' అని స్మిత్ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా వన్డే సిరిస్ కోసమే స్వదేశానికి

ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా వన్డే సిరిస్ కోసమే స్వదేశానికి

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న వన్డే సిరీస్‌ కోసం స్టోక్స్‌ తన దేశానికి తిరిగి వెళ్తున్నాడు. ప్లేఆఫ్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగే క్వాలిఫయర్‌-1లో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో పూణె తలపడనుంది. టోర్నీలో మొత్తం 12 మ్యాచ్‌లాడిన స్టోక్స్‌ 316 పరుగులు చేసి 12 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈసీబీ నిర్ణయంపై మండిపడ్డ పీటర్సన్

ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేయమంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చేసిన హెచ్చరికపై ఆ దేశ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మండిపడ్డాడు. 'నిజంగా విషాదకరం. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ ఐపీఎల్ ఫైనల్స్ ఆడటానికి బదులు స్పెయిన్‌కు వెళ్లి బీర్లు త్రాగడం మంచిదా?' అని వెటకారంగా ట్వీట్ చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rising Pune Supergiant (RPS) defeated Kings XI Punjab (KXIP) in the must win game to get into the playoffs stage of the Indian Premier League (IPL) 2017.
Please Wait while comments are loading...