వెయిటర్ నుంచి ముంబై పేసర్ వరకు: ఎవరీ కుల్వంత్‌ ఖేజ్రోలియా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో మంది గల్లీ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన టోర్నమంట్. అంతేకాదు కొందరు ఆటగాళ్లకు కాసుల వర్షం కూడా కురిపించింది. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్న మంది చాలా మంది ఉన్నారు.

ప్రతిరోజూ పనిచేస్తేనే గానీ కుటుంబం గడవని వాళ్లు కూడా ఉన్నారు. దేశవాళీ క్రికెట్ టోర్నీలో రాణించి జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లతో వేలంలో పోటీ పడి కోట్ల రూపాయలను సొంతం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ఆటగాడే కుల్వంత్‌ ఖేజ్రోలియా. పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

క్రికెట్ దిగ్గజాలతో పాటు మోడ్రన్ డే క్రికెట్‌లో రాణిస్తున్న ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ని పంచుకోవాలన్న తన కల ఐపీఎల్ పదో సీజన్‌లో సాకారమైందని చెప్పుకొచ్చాడు. రాజస్ధాన్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన కుల్వంత్‌ ఖేజ్రోలియా ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన కుల్వంత్‌ ఖేజ్రోలియా పేసర్ కాకముందు గోవాలోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేశాడు.

ఐపీఎల్‌కి ముందు తన పరిస్థితి దారుణం

ఐపీఎల్‌కి ముందు తన పరిస్థితి దారుణం

ఐపీఎల్‌కి ముందు తన పరిస్థితి కూడా దారుణంగా ఉండేదని తన జట్టు ముంబై ఇండియన్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించాడు. ‘ఏడాది క్రితం నుంచి క్రికెట్‌ ఆడటం ఆరంభించాను. అంతకుముందు గోవాలోని ఒక రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేశాను. నేను క్రికెట్ ఆడుతున్నానని నా కుటుంబానికి చెప్పలేదు' అని అందులో తెలిపాడు.

బూట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడా లేవు

బూట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడా లేవు

'ప్రాక్టీస్‌ చేసేందుకు అవసరమైన బూట్లు(స్పైక్స్‌) కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడా లేవు. మైదానంలోనే ఎక్కువసేపు ఉండి బాగా శ్రమించేవాడిని. సాయంకాలం వేళలో జిమ్‌లో కసరత్తులు చేయడానికి వెళ్లేవాడిని. నేను క్రికెట్‌ ఆడేందుకు వెళ్తున్నానని మా కుటుంబంలో ఎవరికీ చెప్పలేదు' అని అన్నాడు.

ఢిల్లీలోని లాల్ బహుదూర్ శాస్త్రి క్లబ్‌లో శిక్షణ తీసుకున్నా

ఢిల్లీలోని లాల్ బహుదూర్ శాస్త్రి క్లబ్‌లో శిక్షణ తీసుకున్నా

'ఢిల్లీలోని లాల్ బహుదూర్ శాస్త్రి క్లబ్‌లో శిక్షణ తీసుకున్నా. అక్కడే సీనియర్‌ క్రికెటర్లు గౌతమ్‌ గంభీర్‌, యువ క్రికెటర్లు ఉన్ముక్త్‌ చంద్‌, నితీశ్‌ రాణాలను చూశా. నా జీవితంలో నేను ఏదైనా సాధించలేకపోతే నేను నా మనసాక్షికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నేను అనుకున్నది సాధించాను. మా గ్రామంతో పాటు జిల్లాలోని అభిమానులు చాలా గర్వంగా ఫీలవుతున్నారు' అని చెప్పాడు.

ఢిల్లీ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీలో అరంగేట్రం

2016 విజయ్‌ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ కనీస ధర రూ.10 లక్షలకు కుల్వంత్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో కుల్వంత్‌ ముంబై తరుపున అరంగేట్రం చేయలేదు. అయితే ముంబై జట్టు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం సత్తా చాటుతున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian Premier League (IPL), in its journey of ten seasons, has witnessed several rags to riches stories. Cricketers from all walks of life have managed to impress the bidders with their performances in the domestic circuits and even a local clubs and earning big bucks.
Please Wait while comments are loading...