ఐపీఎల్: ఫామ్ లేని ధోనికి లెజెండరీ స్పిన్నర్ మద్దతు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మ్యాచ్‌లను అద్భుతంగా ఫినిష్ చేయడంలో ధోని స్టయిలే వేరు. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు అనేకం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో ధోని తన ఆటతీరులో విమర్శలు పాలవుతున్నాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు

ఐపీఎల్ పాయింట్ల పట్టిక

ఐపీఎల్ 2017 ఫోటోలు

ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోని ప్రస్తుత సీజన్‌లో తన ఆటకు తగ్గట్టుగా ఆడటం లేదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ధోని 12 నాటౌట్, 5, 11, 5, 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో ధోనికి గడ్డు కాలం నడుస్తోంది. కెప్టెన్స్ నుంచి ధోనిని తప్పించడంతో జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

IPL 2017: A legend throws weight behind struggling MS Dhoni

కెప్టెన్‌గా కాకుండా ఓ ఆటగాడిగా ధోని ఆడుతున్న తొలి ఐపీఎల్ టోర్నీ ఇదే. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆడుతున్నాడు. దీంతో ధోనిపై కొందరు బహిరంగంగానే విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్ లెజండరీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ధోనీకి గట్టిగా అండగా నిలబడ్డాడు. ధోని ఎవరి దగ్గర తన సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, అతను గొప్ప స్ఫూర్తిదాయకమైన కెప్టెన్‌ అంటూ షేన్ వార్న్ కొనియాడాడు.

ఈ నేపథ్యంలో షేన్‌ వార్న్‌ ట్విట్టర్‌లో ధోనీ గురించి స్పందించాడు. 'ఎవరి దగ్గర ఏ విషయంలో ధోనీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఫార్మెట్లలోనూ అతను అద్భుతమైన క్లాస్‌ ఆటగాడు. స్ఫూర్తిదాయకంగా నిలిచే గొప్ప కెప్టెన్‌' అని షేన్ వార్న్‌ ట్వీట్‌ చేశాడు.

ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ధోని టీ20ల్లో ఏమంత గొప్పగా ఆడట్లేదని సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'ధోని వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్ ప్లేయర్. కానీ టీ20ల్లో ఇప్పుడు కూడా అలాంటి ప్రదర్శనే చేయగలడని నేనైతే అనుకోవడం లేదు. 10 ఏళ్ల టీ20 కెరీర్‌లో అతడు సాధించింది ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే' అని అన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahendra Singh Dhoni, the batsman, is not having the best of times in the Indian Premier League (IPL) 2017. But he is receiving support from fans and former cricketers. Now, a legend has backed the former Indian captain.
Please Wait while comments are loading...