రికార్డులే రికార్డులు: బెంగళూరు Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దీంతో గుజరాత్‌కు 214 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

బెంగళూరు ఓపెనర్లు క్రిస్ గేల్ (38 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సులు), విరాట్ కోహ్లీ (50 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. క్రిస్ గేల్ విజృంభించి 38 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీ20ల్లో పది వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు.

ఇక కోహ్లీ 50 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 64 పరుగుల్ని నమోదు చేశాడు. వీరిద్దరి జోడీ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్‌కు అదృష్టం కలిసి రాగా, గుజరాత్ ఫీల్డర్ మెకల్లమ్‌ను దురదృష్టం వెంటాడింది. గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన ఇన్నింగ్స్ 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు.

Match 20: Highlights: Bangalore (RCB) Vs Gujarat (GL)

దీనిని మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అతని పెట్టుకున్న ఫ్లాపీ హ్యాట్ గేల్‌ను రక్షించింది. థర్డ్ అంపైర్ రివ్యూలో క్యాప్ బౌండరీకి తగలడంతో గేల్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇక అర్ధసెంచరీ పూర్తి అయిన తర్వాత కోహ్లీ జోరును మరింత పెంచే క్రమంలో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

చివర్లో ట్రావిస్ హెడ్ (30 నాటౌట్: 16 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సు), కేదార్ జాదవ్ (16 బంతుల్లో 38 నాటౌట్: 5 ఫోర్లు, 2 సిక్సుల)తో రాణించడంతో బెంగళూరు భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో కులకర్ణి, థంపి చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ లయన్స్‌లో జేసన్‌ రాయ్‌, మునాఫ్‌ పటేల్‌, ప్రవీణ్‌ కుమార్‌ ఆడడం లేదు. ఇక గాయం కారణంగా బెంగళూరు జట్టులో డివిలియర్స్‌ ఆడడం లేదు. అతడి స్థానంలో క్రిస్‌గేల్‌ జట్టులోకి వచ్చాడు.

బెంగళూరు Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్:

* గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి ఏబీ డివిలియర్స్ దూరమయ్యాడు.
* టీ20ల్లో బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ పదివేల పరుగులు పూర్తి చేశాడు.
* ఈ మ్యాచ్‌లో థంపీ బౌలింగ్‌లో నాలుగో ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీసి మూడు పరుగులు సాధించడంతో ఈ ఘనత సాధించాడు.
* రవీంద్ర జడేజా వేసిన ఓవర్‌లో క్రిస్ గేల్ 21 పరుగులు రాబట్టాడు.
* జడేజా వేసిన ఇన్నింగ్స్ 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు.
* మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అతని పెట్టుకున్న ఫ్లాపీ హ్యాట్ గేల్‌ను రక్షించింది. థర్డ్ అంపైర్ రివ్యూలో క్యాప్ బౌండరీకి తగలడంతో గేల్ నాటౌట్‌గా ప్రకటించాడు.
* ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి అర్ధసెంచరీని చైనామెన్ శివిల్ కౌశిక్ ఓవర్‌లో 104 మీటర్ల సిక్సుతో సాధించాడు.
* 11వ ఓవర్లో క్రిస్ గేల్ రెండు సిక్సులు బాది బెంగళూరు స్కోరు బోర్డు 100 పరుగులు దాటించాడు.
* 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బసిల్ తంఫీ బౌలింగ్‌లో క్రిస్ గేల్ అవుటయ్యాడు.
* విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌లు కలిసి తొలి వికెట్ భాగస్వామ్యానికి 122 పరుగుల జోడించారు.
* 43 బంతుల్లో విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీకి ఇది 28వ ఐపీఎల్ అర్ధసెంచరీ
* ధవల్ కులకర్ణి బౌలింగ్‌లో 64 పరుగుల వద్ద కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు.
* ఐపీఎల్ 2017లో ఆర్సీబీ నమోదు చేసిన 213 పరుగులే ఇప్పటివరకు అత్యధిక స్కోరు.
* 16 బంతుల్లో కేదార్ జాదవ్ 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
* ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
* మూడో వికెట్‌కు జాదవ్-హెడ్‌లు 25 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'Universe Boss' Chris Gayle and 'Run Machine' Virat Kohli slammed their respective half-centuries as Royal Challengers Bangalore (RCB) scored 213/2 in 20 overs against Gujarat Lions (GL) here in the Indian Premier League (IPL) 2017 on Tuesday (April 18).
Please Wait while comments are loading...