ఐపీఎల్, మ్యాచ్ 21: సన్‌రైజర్స్ Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌ పదో సీజన్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌కు 192 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్కోరు 12 వద్ద 2వ ఓవర్‌లోనే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(4) వికెట్‌ చేజార్చుకుంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌, మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌‌తో కలిసి చక్కటి శుభారంభాన్నిచ్చాడు.

IPL 2017: Match 21: Highlights: Hyderabad (SRH) Vs Delhi (DD)

ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 33 బంతుల్లో విలియమ్సన్ అర్ద సెంచరీ పూర్తి చేయగా ధావన్ 40 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లేలో నిదానంగా ఆడుతూ వచ్చిన వీరిద్దరూ ఆపై ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ వచ్చారు.

6 ఫోర్లు, 5 సిక్స్ లతో 89 పరుగులు చేసిన విలయమ్సన్ క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. రెండో వికెట్‌కు విలియమ్సన్, ధావన్‌లు 136 పరుగుల జోడించారు. భారీ షాట్లు ఆడే క్రమంలో విలియమ్సన్‌ క్రిస్‌ మోరీస్‌ వేసిన 17వ ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చాడు.

అనంతరం స్వల్ప వ్యవధిలోనే 19వ ఓవర్‌లో శిఖర్‌ ధావన్‌ కూడా క్రిస్‌ మోరీస్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాతి బంతికే యువీ (3) వద్ద బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్, సందీప్ హుడా చివరి ఓవర్లో 17 పరుగులు రాబట్టడంతో సన్‌రైజర్స్ 191 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

హైదరాబాద్ Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్:

* రెండో ఓవర్‌లోనే ఢిల్లీ ఓపెనర్ శ్యామ్ బిల్లింగ్స్‌ వికెట్‌ను చేజార్చుకుంది.
* ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సిరాజ్ శ్యామ్ బిల్లింగ్స్‌‌ను పెవిలియన్‌కు చేర్చాడు.
* ఐపీఎల్‌లో మొట్టమొదటి సారి రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు.
* ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన తర్వాత కరుణ్ నాయర్ తొలిసారి 30కి పైగా పరుగులు చేశాడు.
* సంజూ శాంసన్ 33 బంతుల్లో 42 పరుగులు చేసి వెనుదిరిగాడు.
* సంజూ శాంసన్, కరుణ్ నాయర్‌లు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* ఐపీఎల్‌ పదో సీజన్‌లో మూడు జట్లు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాయి.
* హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జయంత్ యాదవ్ తొలిసారి ఓపెనింగ్ బౌలింగ్ చేశాడు.
* ఈ సీజన్‌లో పవర్ ప్లేలో పరుగులు తగ్గించేందుకు ఇప్పటివరకు ఢిల్లీ అతడిని బౌలింగ్ చేయించింది.
* క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో హైదరాబాద్ ఓపెనర్ వార్నర్ 4 పరుగులకే పెవిలియన్ కు చేరాడు.
* ఐపీఎల్ పదో సీజన్ ‌లో వార్నర్ అతి తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరడం ఇదే మొదటిసారి.
* 98 బంతుల్లో కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్‌ల జోడీ 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* ఈ సీజన్‌లో కేన్ విలియమ్సన్‌కు ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం.
* యువరాజ్ సింగ్‌కు ఇది 200వ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్‌లో యువరాజ్ 3 పరుగులకే అవుటయ్యాడు.
* 4 సన్ రైజర్స్ ఆటగాళ్ల వికెట్లను క్రిస్ మోరిస్ పడగొట్టడం విశేషం. 4 ఓవర్లు వేసిన మోరిస్ 26 పరుగులిచ్చాడు.
* 4 ఓవర్లలో మోరిస్ 10 డాట్ బాల్స్ వేయడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Riding over brilliant fifties from Shikhar Dhawan and Kane Williamson, Sunrisers Hyderabad set a target of 192 for the Delhi Daredevils to chase in the league match of the Indian Premier League (IPL) 2017 here on Wednesday (April 19).
Please Wait while comments are loading...