సునీల్ నరేన్ రికార్డు: కోల్‌కతా Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌లో పదో సీజన్‌లో భాగంగా గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్లలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ విజయ లక్ష్యం 188 పరుగులుగా నిర్దేశించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ సునీల్ నరైన్ (17 బంతుల్లో 42; 9 ఫోర్లు, 1 సిక్సర్)తో మెరుపులు మెరిపించగా, కెప్టెన్ గౌతం గంభీర్ (28 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్సర్)తో ఆకట్టుకున్నాడు. రైనా బౌలింగ్‌లో ఫాల్కనర్‌కి క్యాచ్‌ ఇచ్చి నరైన్‌ వెనుదిరిగాడు.

Highlights: Kolkata (KKR) Vs Gujarat (GL)

ఈ క్రమంలో కోల్‌కతా తొలి వికెట్‌కు 57 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప (48 బంతుల్లో 72; 8 ఫోర్లు,2 సిక్సర్లు) తనదైన శైలిలో అలరించాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 69పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 11.3వ ఓవర్‌ వద్ద ఫాల్కనర్‌ బౌలింగ్‌లో గంభీర్‌(33) అవుటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే 24 పరుగులు సాధించి థంపి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మనీష్ పాండే (21 బంతుల్లో 24; 2 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించాడు. రాబిన్ ఊతప్ప, మనీశ్‌ జోడీ మూడో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కోల్‌కతా తరుపున 50వ మ్యాచ్‌ ఆడుతున్న రాబిన్ ఊతప్ప అర్ధ సెంచరీ సాధించాడు.

ఆ తర్వాత ప్రవీణ్‌ కుమార్‌ బౌలింగ్‌ మెకల్లమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఉతప్ప(72) వెనుదిరిగాడు. చివరి ఓవర్‌ వేసిన థంపి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్ మరోసారి విజృంభించాడు. 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో ప్రవీణ్‌ కుమార్‌, ఫాల్కనర్‌, థంపి, రైనా తలో వికెట్‌ తీసుకున్నారు.

Highlights: Kolkata (KKR) Vs Gujarat (GL)

కోల్‌కతా Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్:

* ఆరోన్ ఫించ్ గుజరాత్‌కు చక్కటి శుభారంభాన్నిచ్చాడు. 15 బంతుల్లో 33 పరుగులు చేసి నాలుగో ఓవర్‌‌లో పెవిలియన్‌కు చేరాడు.
* ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్ మరోసారి విజృంభించాడు. 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు.
* ఓపెనర్‌గా వచ్చి ఫోర్లు, సిక్సులు బాదిన తొలి బ్యాట్స్ మెన్‌గా సునీల్ నరైన్ రికార్డు సృష్టించాడు.
* ఈ మ్యాచ్‌లో శ్రీలంక మాజీ బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య ఐపీఎల్ రికార్డుని సునీల్ నరేన్ బద్దలు కొట్టాడు.
* డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడిన సనత్ జయసూర్య ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సులతో 36 పరుగులు చేశాడు.
* ఇప్పుడు ఆ రికార్డుని సునీల్ నరేన్ బద్దలు కొట్టాడు.
* సురేశ్ రైనా తన తొలి ఓవర్‌లో సునీల్ నరేన్‌ని అవుట్ చేశాడు.
* 11.3వ ఓవర్‌ వద్ద ఫాల్కనర్‌ బౌలింగ్‌లో గంభీర్‌(33) అవుటయ్యాడు.
* గంభీర్-ఊతప్పల జోడీ రెండో వికెట్‌కి 69పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
* 48 బంతుల్లో రాబిన్ ఊతప్ప 72 పరుగులు చేశాడు.
* రాబిన్ ఊతప్ప, మనీశ్‌ జోడీ మూడో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kolkata Knight Riders scored 187/5 to set a target of 188 runs for Gujarat Lions to chase in the league match in Indian Premier League (IPL) 2017 here on Friday (April 21).
Please Wait while comments are loading...