చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన ఢిల్లీ: 67 రన్స్‌కు ఆలౌట్, వికెట్ పోకుండా పంజాబ్ విన్

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: ఐపీఎల్‌‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ పైన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పేలవమైన ప్రదర్శన చేసింది. 17.1 ఓవర్లో వికెట్లన్నీ కోల్పోయి కేవలం 67 పరుగులే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ వికెట్ కోల్పోకుండా 68 పరుగులు చేసింది.

పంజాబ్ టీంలో బౌలర్ సందీప్ శర్మ అద్భుత ప్రతిభ కనబరిచాడు. అతను ఇరవై పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. వరుణ్ ఆరోన్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికట్లు తీశారు.

ipl 10

పంజాబ్ బ్యాటింగ్

- గుప్టిల్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేశాడు. ఆమ్లా 20 బంతుల్లో 16 పరుగులు చేశాడు. వీరిద్దరే లక్ష్యాన్ని చేధించారు.
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది.

ఢిల్లీ బ్యాటింగ్

- ఢిల్లీ డేర్ డెవిల్స్ 17.1 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ దారుణంగా ఆడింది. ఎవరు కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. అండర్సన్ చేసిన 18 పరుగులే అత్యధిక వ్యక్తిగత పరుగులు.
- 17.1 ఓవర్ వద్ద ఢిల్లీ పదో వికెట్ కోల్పోయింది. శర్మ 1 బంతిలో పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు.
- 16.6 ఓవర్ వద్ద షమీ అవుటయ్యాడు. షమీ 4 బంతుల్లో 2 పరుగులు చేశాడు.
- 15.3 ఓవర్ వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రబడ 20 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు.
- 14.1 ఓవర్ వద్ద డిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. అండర్సన్ 25 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటయ్యాడు.
- 12 ఓవర్లకు 51 పరుగులు చేసింది ఢిల్లీ.
- ఢిల్లీ 10 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి కేవలం 37 పరుగులు చేసింది.
- 8.4 ఓవర్ వద్ద 5 బంతుల్లో 2 పరుగులు చేశాడు.
- 7.4 ఓవర్ వద్ద పంత్ అవుటయ్యాడు. అతను 6 బంతుల్లో 3 పరుగులు చేశాడు.
- 6.1 ఓవర్ వద్ద నాయర్ అవుటయ్యాడు. అతను 10 బంతుల్లో 11 పరుగులు చేశాడు.
- 4.6 ఓవర్ వద్ద అయ్యర్ అవుటయ్యాడు. అతను 7 బంతుల్లో ఆరు పరుగులు చేశాడు.
- బిల్లింగ్స్ 2.5 ఓవర్ వద్ద అవుటయ్యాడు. 2 బంతుల్లో పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు.
- 0.6 బంతుల్లో శాంసన్ అవుటయ్యాడు. అతను 14 బంతుల్లో 5 పరుగులు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kings XI Punjab won the toss against Delhi Daredevils in the league match of the Indian Premier League (IPL) 2017 and invited Delhi to bat first here on Sunday (April 30).
Please Wait while comments are loading...