ఐపీఎల్, మ్యాచ్ 52: కీలక మ్యాచ్‌లో పూణెపై గెలిచిన ఢిల్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా పూణెతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కీలకమైన మ్యాచ్‌లో ఓడి పుణె ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

పూణ ఓపెనర్లు రహానే డకౌట్ కాగా, రాహుల్ త్రిపాఠి 7 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్ (38), మనోజ్ తివారీ (45 బంతుల్లో 60) పరుగులతో దూకుడుగా ఆడారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బెన్ స్టోక్స్ (33), ధోని (5), డానియేల్ క్రిస్టియన్ (3) పరుగులతో నిరాశ పరిచారు.

DD win the toss and elect to bat

ఢిల్లీ బౌలర్లలో జహీర్ ఖాన్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీసుకోగా, నదీమ్, కమ్మిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు.

పూణె విజయ లక్ష్యం 169

ఫిరోజ్ షా కోట్లా వేదికగా పూణెతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ జట్టును కరుణ్ నాయర్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

ఢిల్లీ ఓపెనర్ సంజూ శాంసన్ రెండు పరుగుల వద్ద రనౌట్ కాగా ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (3) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. దీంతో ఢిల్లీ తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (22 బంతుల్లో 36), కరుణ్ నాయర్ (45 బంతుల్లో 64; 9 ఫోర్లు)తో రాణించారు.

DD win the toss and elect to bat

జంపా బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టిన యువ ఆటగాడు రిషబ్ పంత్ అదే ఊపులో మరో భారీ షాట్ ఆడబోయి మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ మాత్రం దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ 18.5 ఓవర్లో ఉనాద్కత్ అద్భుత క్యాచ్‌తో నాయర్ పెవిలియన్‌కు చేరాడు.

దీంతో 45 బంతులలో 9 ఫోర్ల సాయంతో కరుణ్ నాయర్ 64 పరుగులు వద్ద అవుటయ్యాడు. ఈ సీజన్‌లో కరుణ్ నాయర్‌కు ఇది అత్యధిక స్కోరు. పూణె బౌలర్లలో ఉనాద్కత్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, వాషింగ్టన్ సుందర్, ఆడమ్ జంపా, డేనియల్ క్రిస్టియాన్ తలో వికెట్ తీసుకున్నారు.

పూణెపై బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడుతుంది. ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో పూణె ఓటమిపాలై ఆ తర్వాత మే 14(ఆదివారం) పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడి, సన్‌రైజర్స్‌ గుజరాత్‌పై గెలిస్తే పుణె ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ మ్యాచ్‌ పూణెకు కీలకం కానుంది.

గత మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో కూడా తన జోరుని కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలు సాధించిన పూణె ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. గత సీజన్‌లో చెత్త ప్రదర్శన చేసిన పూణె ఈ సీజన్‌లో మాత్రం మంచి ప్రదర్శన చేస్తోంది.

ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 పరాజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా చివరగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు నమోదు చేసింది. దీంతో 16 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో నిలిచింది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన చేస్తోంది.

ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 5 విజయాలు, 7 పరాజయాలు నమోదు చేసింది. దీంతో 10 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. అయితే గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది.

జట్ల వివరాలు:

రైజింగ్ పూణె సూపర్ జెయింట్:
A Rahane, R Tripathi, S Smith, MS Dhoni, M Tiwary, B Stokes, D Christian, W Sundar, S Thakur, A Zampa, J Unadkat

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌:
S Samson, K Nair, R Pant, S Iyer, C Anderson, M Samuels, P Cummins, A Mishra, S Nadeem, M Shami, Z Khan

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
DD win the toss and elect to bat.
Please Wait while comments are loading...