చెలరేగిన హైదరాబాద్ కుర్రాడు: ఫ్లేఆఫ్‌కు సన్‌రైజర్స్, మ్యాచ్ హైలెట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సమష్టిగా పోరాడి విజయం సాధించింది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 69 నాటౌట్; 9 ఫోర్లు), విజయ్ శంకర్ (44 బంతుల్లో 63 నాటౌట్; 9 ఫోర్లు)తో అర్ధ సెంచరీలతో రాణించడంతో గుజరాత్ లయన్స్‌పై 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. [స్కోరు కార్డు]

Highlights: Gujarat Vs Hyderabad

తాజా విజయంతో 8 విజయాలను సాధించిన సన్‌రైజర్స్ 17 పాయింట్లతో (బెంగళూరు మ్యాచ్‌ రద్దుతో 1 పాయింట్‌ కలిపి) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 25 పరుగులకే ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (18), హెన్రిక్స్‌ (4) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ (52 బంతుల్లో 69; 9 ఫోర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వార్నర్ చివరి వరకూ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఐపీఎల్: బరిలో నిలిచిన సన్‌రైజర్స్, ఖాయమైన ప్లేఆఫ్‌ బెర్త్

వీరిద్దరూ 15.1 ఓవర్లలో మూడో వికెట్‌కి అజేయంగా 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. వార్నర్‌తో పాటు విజయ్‌ శంకర్‌ (44 బంతుల్లో 63; 9 ఫోర్లు) అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌లో తొలి అర్ధ సెంచరీ చేశాడు. రెండో వికెట్‌కు వీరిద్దరి జోడీ 133 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన అంకిత్ సోని బౌలింగ్‌లో తొలి బంతినే బౌండరీ బాదిన వార్నర్ సన్ రైజర్స్‌కు విజయాన్ని అందించాడు. అంతకముందు గుజరాత్ లయన్స్ 19.2 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.

హైదరాబాద్ Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్:

* టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
* గుజరాత్ లయన్స్ తరుపున ఇషాన్ కిషన్, డ్వేన్ స్మిత్ ఓపెనింగ్ చేశారు.
* పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా గుజరాత్ 61 పరుగులు చేసింది.
* 27 బంతుల్లో గుజరాత్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
* మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
* 10 ఓవర్లకు గాను గుజరాత్ వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది.
* 54 పరుగుల వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో డ్వేన్ స్మిత్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
* 34 పరుగుల తేడాతో గుజరాత్ 8 వికెట్లను కోల్పోయింది.
* ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసుకోగా మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీశాడు.
* 19.2 ఓవర్లకు గుజరాత్ 154 పరుగులు చేసి ఆలౌటైంది.
* సన్ రైజర్స్ తరుపున వార్నర్, శిఖర్ ధావన్లు ఓపెనింగ్ చేశారు.
* ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లో 11 బంతుల్లో 18 పరుగుల వద్ద ధావన్ అవుటయ్యాడు.
* సన్ రైజర్స్ పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది.
* 41 బంతుల్లో డేవిడ్ వార్నర్ అర్ధసెంచరీని పూర్తి చేశాడు.
* సన్ రైజర్స్ ఆటగాడు విజయ్ శంకర్ 35 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించాడు. శంకర్‌కు ఇది తొలి ఐపీఎల్ అర్ధ సెంచరీ.
* వీరిద్దరి జోడీ రెండో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
* విజయ్ శంకర్ 44 బంతుల్లో 63 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, వార్నర్ సైతం 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
* గుజరాత్ లయన్స్‌పై సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
* ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunrisers Hyderabad (SRH) booked their berth in the playoffs of IPL 2017 by beating Gujarat Lions (GL) by 8 wickets in their final match of the league stage.
Please Wait while comments are loading...