ఏబీ మెరుపు ఇన్నింగ్స్ వృధా: బెంగళూరుపై పంజాబ్‌పై గెలుపు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్‌లో పంజాబ్ జట్టు సత్తా చాటుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అద్భుత ప్రదర్శనతో బెంగళూరుపై గెలిచింది. 149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

పంజాబ్‌ ఓపెనర్లు వోహ్రా (21 బంతుల్లో 34; 4 ఫోర్లు, ఒక సిక్సు), హషీమ్‌ ఆమ్లా(38 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సులు)తో నాటౌట్‌‌గా నిలిచి చక్కటి శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ వెంటనే పెవిలియన్‌కు చేరినా కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సులు) నాటౌట్‌ నిలవడంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ లక్ష్యాన్ని చేధించింది. బెంగుళూరు బౌలర్లలో తైమాల్‌ మిల్స్‌, ఇమ్రాన్‌ తహీర్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు వరుసగా ఇది రెండో విజయం.

IPL 2017: Match 8: Bengaluru win toss, opt to bat first against Punjab

పంజాబ్ విజయ లక్ష్యం 149

ఇండోర్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 149 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

గేల్ స్ధానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఏబీ డివిలియర్స్ (46 బంతుల్లో 89, 3 ఫోర్లు, 9 సిక్సు) విధ్వంసం సృష్టించాడు. తొలుత నిలకడగా ఆడిన డివిలియర్స్ చివరి మూడు ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పదిహేడో ఓవర్‌ ఆఖరి బంతికి సిక్సర్‌ బాది అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

అర్ధ సెంచరీ అనంతరం డివిలియర్స్‌ ఆ తర్వాత మరింత విజృభించాడు. పంజాబ్ బౌలర్లు బంతులు ఎక్కడ వేసినా సిక్సర్లతో విజృంభించాడు. 16వ ఓవర్ వేసిన వరున్ అరోన్ బౌలింగ్‌లో ఓ సిక్స్ బాదిన ఏబీ.. స్టాయినిస్ వేసిన 17 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదేశాడు. 18 ఓవర్‌లో స్టువర్ట్ బిన్నీ (20 బంతుల్లో 18 నాటౌట్, ఒక ఫోర్, ఒక సిక్స్) కొట్టగా ఏబీ కూడా ఓ బంతిని స్టాండ్స్‌లోకి తరలించేశాడు.

డివిలియర్స్ దూకుడు పెంచడంతో 19వ ఓవర్‌ని సీనియర్ బౌలర్ సందీప్ శర్మ చేతికి పంజాబ్ కెప్టెన్ మాక్స్‌వెల్ బంతి ఇవ్వగా.. ఆ ఓవర్‌లోనూ ఈ హిట్టర్ ఒక ఫోర్, రెండు వరుస సిక్సర్లతో 19 పరుగులు రాబట్టేశాడు. చివరిగా 20వ ఓవర్‌ వేసిన మోహిత్ శర్మ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్ని డివిలియర్స్ సిక్స్‌లుగా మలచడంతో బెంగళూరు మెరుగైన స్కోరు చేయగలిగింది.

ఇన్నింగ్స్ చివరి బంతిని ఏబీ భారీ షాట్ ఆడగా బంతి ఏకంగా స్టేడియం దాటి వెళ్లిపోవడం విశేషం. దీంతో 68 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు ఇన్నింగ్స్‌ ముగిసే వరకు మరో వికెట్‌ కోల్పోకుండా ఆడింది. పంజాబ్ బౌలర్లలో వరుణ్ అరోన్ 2 వికెట్లు తీయగా సందీప్ శర్మ, అక్షర పటేల్ చెరో వికెట్ తీశారు.

టాస్ గెలిచిన బెంగళూరు ఆదిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్‌ పటేల్‌ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతికి వాట్సన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. బెంగళూరు తాత్కాలిక కెప్టెన్ షేన్‌ వాట్సన్‌ ఐపీఎల్లో ప్రతిసారీ అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లోనే అవుటవ్వడం విశేషం. 18 పరుగులకే ఓపెనర్లు షేన్ వాట్సన్ (1), విష్ణు వినోద్(7) వికెట్లను కోల్పోయింది.

ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో కేదర్ జాదవ్(1) వికెట్‌ను నష్టపోయింది. బెంగళూరు ఆటగాళ్లలో కేదార్ జాదవ్ (1), మన్దీప్ సింగ్ (28), స్టువర్ట్ బిన్నీ (18 నాటౌట్)గా నిలిచారు. ఐపీఎల్ 10వ సీజన్‌లో మ్యాచ్ 8 ప్రారంభమైంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో 360 డిగ్రీల బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్ ఆడుతుండటం విశేషం. గత రెండు మ్యాచ్‌ల్లో గేల్ నిరాశపరచడంతో రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశారు. మరోవైపు డివిలియర్స్ అందుబాటులోకి వచ్చినా బెంగళూరు తాత్కాలిక కెప్టెన్‌గా షేన్ వాట్సనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 10వ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒకదాంట్లో ఓటమి పాలవ్వగా, మరొక మ్యాచ్‌లో గెలిచింది.

తుది జట్టులో బెంగళూరు స్వల్ప మార్పులు చేసింది. క్రిస్‌గేల్‌ స్థానంలో ఏబీ డివిలియర్స్‌ చోటు దక్కించుకున్నాడు. పంజాబ్‌లో స్వప్నిల్‌ సింగ్‌ స్థానంలో వరుణ్‌ ఆరోన్‌ చోటు సంపాదించాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 18 మ్యాచ్‌ల్లో తలపడగా పంజాబ్‌ కింగ్స్‌ 10, రాయల్‌ ఛాలెంజర్స్‌ 8 మ్యాచ్‌ల్లో గెలిచారు.

జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

Shane Watson (C), Vishnu Vinod (W), AB de Villiers, Kedar Jadhav, Mandeep Singh, Stuart Binny, Pawan Negi, Iqbal Abdulla, Tymal Mills, Billy Stanlake, Yuzvendra Chahal

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

Shane Watson (C), Vishnu Vinod (W), AB de Villiers, Kedar Jadhav, Mandeep Singh, Stuart Binny, Pawan Negi, Iqbal Abdulla, Tymal Mills, Billy Stanlake, Yuzvendra Chahal

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Royal Challengers Bangalore (RCB) skipper Shane Watson won the toss and opted to bat first against Kings XI Punjab (KXIP) here on Monday (April 10).
Please Wait while comments are loading...