బౌండరీల్లేవ్: రాణా అద్భుత ఇన్నింగ్స్, ఆ జాబితాలో టాప్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో దేశవాళీ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్, ముంబై ఇండియన్స్ జట్టులో నితీశ్ రాణా, గుజరాత్ లయన్స్ నుంచి బసిల్ థంపి పదో సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. గురువారం ఇండోర్ వేదికగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ రాణా చెలరేగి ఆడాడు.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో నితీశ్‌ రాణా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారీ ఇన్నింగ్స్‌లతో ముంబై వరుస విజయాల్లో కీలకంగా మారాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో నితీశ్ రాణా ఇప్పటివరకు మూడు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ రాణా చెలరేగి ఆడటంతో సిక్సర్లు బాదిన వారి జాబితాలో మొదటి స్ధానంలో నిలిచాడు.

రాణా ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లో 16 సిక్సులు బాదాడు. రాణా తర్వాత గుజరాత్ లయన్స్ ఆటగాడు మెక్ కల్లమ్ 15 సిక్సులతో రెండో స్ధానంలో ఉన్నాడు. మూడు అర్ధసెంచరీలతో పాటు 255 పరుగులు చేసిన నితీశ్ రాణా ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణా ఓ ఘనత సాధించాడు.

ఒక్క బౌండరీ కూడా లేదు

ఒక్క బౌండరీ కూడా లేదు

నిజానికి టీ20ల్లో ఓ బ్యాట్స్‌మన్‌ 10 పరుగులు చేస్తే అందులో కనీసం ఒక బౌండరీ ఉంటుంది. కానీ ఐపీఎల్‌లో ఒక్క సింగిల్ లేకుండా అచ్చం ఫోర్లు, సిక్సులతో ఇప్పటి వరకు ముగ్గురు బ్యాట్స్‌మన్‌ అద్భుమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ ముగ్గురే నితీశ్‌ రాణా, డేవిడ్‌ మిల్లర్‌, డ్వేన్‌ బ్రావో. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా గురువారం కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌‌తో ముంబై ఇండియన్స్ తలపడింది.

20 ఓవర్లలో 198 పరుగులు చేసిన పంజాబ్

20 ఓవర్లలో 198 పరుగులు చేసిన పంజాబ్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 199 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గురువారం నితీశ్‌ (34 బంతుల్లో 62 నాటౌట్‌; 7సిక్సులు) ఈ ఘనత సాధించాడు. ఏకంగా ఏడు సిక్సర్లు బాది ఫోర్లు లేకుండానే అర్ధ సెంచీరీని సాధించాడు.

34 బంతుల్లో 62 నాటౌట్‌గా నిలిచిన రాణా

34 బంతుల్లో 62 నాటౌట్‌గా నిలిచిన రాణా

నితీశ్ రాణా (34 బంతుల్లో 62 నాటౌట్, 7 సిక్సులు), బట్లర్ (37 బంతుల్లో 77, 7 ఫోర్లు, 5 సిక్సులు) రాణించడంతో ఈ మ్యాచ్‌లో ముంబై 15.3 ఓవర్లకే విజయం సాధించింది. అంతకముందు ఐపీఎల్‌ 2012 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావో కేవలం సిక్సర్లతో 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 193/6 పరుగులు చేసింది.

గతంలో ఇలా

గతంలో ఇలా

చివర్లో బ్యాటింగ్ ఆడేందుకు వచ్చిన బ్రావో 18 బంతుల్లో 5 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 74 పరుగులతో విజయం సాధించింది. 2014 సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 51 నాటౌట్‌; 6ఫోర్లు) ఆరు సిక్సర్లు బాది అర్ధ సెంచరీ సాధించాడు. రాజస్థాన్‌ రాయల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్‌తో కలిసి మాక్స్‌వెల్‌ (45 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సులు)తో కలిసి జట్టుకు విజయాన్నందించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mumbai Indians (MI) youngster Nitish Rana has set the Indian Premier League (IPL) 2017 alight with his breathtaking batting display so far.
Please Wait while comments are loading...