ఐపీఎల్‌లో అనుకోని అవాంతరం: షెడ్యూల్‌లో స్పల్ప మార్పు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఏప్రిల్‌ 22న జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. ఏప్రీల్ 22న ఢిల్లీ, ముంబై జట్ల మధ్య సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్‌ను ముంబైకి తరలించారు.

ఈ మ్యాచ్‌ని రాత్రి 8 గంటలకు నిర్వహిస్తారు. దీంతో షెడ్యూల్‌ ప్రకారం రాత్రి 8 గంటలకు జరగాల్సిన రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ను సాయంత్రం 4 గంటలకు మార్చారు. ఢిల్లీ వేదికగా ఢిల్లీ, ముంబై మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను మే 6న నిర్వహిస్తారు.

IPL 2017: Minor changes in schedule due to municipal elections in Delhi

ప్రస్తుత షెడ్యూల్‌:
ఏప్రిల్‌ 22 (వేదిక ఢిల్లీ): ఢిల్లీ Vs ముంబై సాయంత్రం 4 గంటలకు
ఏప్రిల్‌ 22 (వేదిక పుణె): పుణె Vs హైదరాబాద్‌ రాత్రి 8 గంటలకు

కొత్త షెడ్యూల్‌:
ఏప్రిల్‌ 22 (వేదిక ముంబై): ఢిల్లీ Vs ముంబై రాత్రి 8 గంటలకు
ఏప్రిల్‌ 22 (వేదిక పుణె) : పుణె Vs హైదరాబాద్‌ సాయంత్రం 4 గంటలకు
మే 6 (వేదిక ఢిల్లీ) : ఢిల్లీ Vs ముంబై రాత్రి 8 గంటలకు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The schedule for three matches of the upcoming Indian Premier League 2017 have been altered due to the Municipal Corporation elections in Delhi.
Please Wait while comments are loading...