ధోనీ సిక్సర్‌: పుణె డగౌట్‌లో పడ్డ రోహిత్‌ శర్మ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్ధి బౌలర్ ఎంతటి వాడైనా జడుసుకోవాల్సిందే. ధోని సిక్సర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోని కొట్టిన బంతి స్టేడియం బయటపడ్డ సందర్భాలు అనేకం.

తాజాగా ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో ధోని తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్‌‌‌తో పూణె నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మ్యాచ్‌లో భాగంగా ధోని కొట్టిన బంతి స్టేడియం బయట పడలేదు గానీ ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పూణె డగౌట్‌లోకి వచ్చి పడ్డాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన పూణె

తొలుత బ్యాటింగ్ చేసిన పూణె

వాంఖడె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత పూణె బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ను ముంబై బౌలర్ మెక్లెనగన్‌ వేశాడు. నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచిన ధోనీ మంచి ఊపు మీద ఉన్నాడు. దాంతో బౌలర్‌ రెండు వైడ్లు వేసి ధోనిని విసిగించాడు. ఈ క్రమంలో ఐదో బంతిని స్టాండ్స్‌లో కొట్టాలన్న కసితో ధోని బ్యాట్‌ను బలంగా ఊపాడు.

ఆఖరి బంతిని సిక్స్‌గా మలచిన ధోని

ఆఖరి బంతిని సిక్స్‌గా మలచిన ధోని

అయితే పరుగులు రాలేదు. అయితే పిచ్‌ మధ్యలో వేసిన ఆఖరి బంతిని సరైన టైమింగ్‌లో అందుకున్న ధోనీ భారీ షాట్ ఆడాడు. దాంతో గాల్లోకి లేచిన బంతిని అందుకోవాలని ముంబై కెప్టెన్ రోహిత్‌శర్మ లాంగాఫ్‌లో పూణె డగౌట్‌ ముందు ఎగిరాడు. బంతి గమనం అంతకన్నా పైన ఉండటంతో డగౌట్‌లో కింద పడ్డాడు.

రోహిత్‌ వెన్నుముకకు గాయమయ్యేదే

రోహిత్‌ వెన్నుముకకు గాయమయ్యేదే

రోహిత్ శర్మ పడే సమయంలో వెనక్కి చూసుకోవడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అలా వెనక్కి పడుంటే రోహిత్‌ వెన్నుముకకు గాయమయ్యేదే. అక్కడ పూణె జట్టు ఆటగాళ్లకు సంబంధించిన కూల్ డ్రింక్స్ డబ్బాలు, బ్యాట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ పడిన వెంటనే పక్కనే ఉన్న పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ దగ్గరకు వచ్చి పైకి లేపాడు.

బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ సమష్టిగా రాణించిన పూణె

ఈ మ్యాచ్‌లో 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి ఓటమి పాలైంది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ సమష్టిగా రాణించిన పూణె ఈ సీజన్‌లో ముంబైపై మరో విజయాన్ని నమోదు చేసింది. లీగ్ దశలో రెండు సార్లు పుణె చేతిలో ఓటమి పాలైన ముంబైకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When Mahendra Singh Dhoni is on fire, no bowling attack in the world can stop him. The Rising Pune Supergiant (RPS) wicketkeeper batsman was at his destructive best, smashing 40 off 26 balls in the death overs to propel his team to a challenging 162 for four in the Indian Premier League (IPL) Season 10 Qualifier 1 against Mumbai Indians (MI) at the Wankhede Stadium in Mumbai on Tuesday.
Please Wait while comments are loading...