ఐపీఎల్ చరిత్రే నిజమైంది: ముంబై ఇండియన్స్ ఓడింది (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఐపీఎల్‌లో 2011లో క్వాలిఫియర్ విధానం ప్రవేశ పెట్టిన తర్వాత ప్రతి సీజన్లోనూ లీగ్ దశను రెండో స్ధానంతో ముగించిన జట్టే కచ్చితంగా ఐపీఎల్ ఫైనల్‌కు ఆనవాయితీ వస్తోంది. తాజాగా ఐపీఎల్ పదో సీజన్‌లో కూడా ఇదే జరిగింది.

లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టు మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించి పైనల్స్‌కు అర్హత సాధించింది. అంతేకాదు ఈ పదో సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఐదు సార్లు పరాజయం పాలైతే అందులో మూడు సార్లు పూణె చేతిలోనే ఓడింది.

దీంతో ముంబై జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామిలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, ఈ సీజన్లో ఆడిన మూడుసార్లు తమను ఓడించిన పూణేపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది.

2011 నుంచి లీగ్ దశలో టాప్ ప్లేస్‌

2011 నుంచి లీగ్ దశలో టాప్ ప్లేస్‌

కాగా, 2011 నుంచి లీగ్ దశలో టాప్ ప్లేస్‌లో నిలిచిన జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు లేవనేది ఐపీఎల్ చరిత్ర స్పష్టం చేస్తోంది. లీగ్ దశలో టాప్ ప్లేస్‌లో ఉన్న జట్లు 2012, 2016 సీజన్లలో ఫైనల్ కు అర్హత సాధించలేకపోయాయి. కానీ ప్రతి సీజన్లోనూ రెండో స్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం.

రెండో స్థానంలో నిలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయం

రెండో స్థానంలో నిలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయం

దీన్నిబట్టి చూస్తే.. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయమన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఐపీఎల్ ఫైనల్లో టాప్ 1,2 స్ధానాల్లో నిలిచిన జట్లు తలపడితే ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న జట్టునే విజయం వరిస్తూ వచ్చింది. తాజాగా ఐపీఎల్ పదో సీజన్‌లో కూడా ఇదే జరిగింది.

14 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌లు గెలిచిన ముంబై

14 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌లు గెలిచిన ముంబై

పదో సీజన్‌లో లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌లు గెలిచి 20 పాయింట్లతో ముంబై ఇండియన్స్ అగ్రస్ధానంలో నిలిచింది. 9 మ్యాచ్‌ల్లో విజయంతో 18 పాయింట్లతో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ (17పాయింట్లు) మూడో స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (16 పాయింట్లు) నాలుగో స్ధానంలో నిలిచాయి.

టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టు టోర్నీ విజేతగా నిలిచిన సందర్భాలు లేవు

టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టు టోర్నీ విజేతగా నిలిచిన సందర్భాలు లేవు

2011లో ఐపీఎల్‌లో ప్లేఆఫ్ పద్ధతిని ప్రవేశపెట్టాక లీగ్ దశలో టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టు టోర్నీ విజేతగా నిలిచిన సందర్భాలు లేవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ కూడా ట్రోఫీని గెలిచే అవకాశం లేదనే ఐపీఎల్ చరిత్ర చెబుతోంది.

2011 నుంచి ఐపీఎల్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లను పరిశీలిస్తే

2011 నుంచి ఐపీఎల్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లను పరిశీలిస్తే

బుధవారం ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుపై క్వాలిఫయర్-2లో ముంబై ఢీకొట్టనుంది.

2011 నుంచి ఐపీఎల్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లను పరిశీలిస్తే..

* 2011: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(1) Vs చైన్నై సూపర్ కింగ్స్(2) - విజేత (చెన్నై)
* 2012: కోల్‌కతా నైట్‌రైడర్స్(2) Vs చైన్నై సూపర్ కింగ్స్(4) - విజేత (కోల్‌కతా)
* 2013: చైన్నై సూపర్ కింగ్స్(1) Vs ముంబై ఇండియన్స్(2) - విజేత (ముంబై)
* 2014: కింగ్స్ ఎలెవ్ పంజాబ్(1) Vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (2) - విజేత (కోల్‌కతా)
* 2015: చైన్నై సూపర్ కింగ్స్(1) Vs ముంబై ఇండియన్స్(2)- విజేత(ముంబై)
* 2016: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(2) Vs సన్‌రైజర్స్ హైదరాబాద్(3)- విజేత (హైదరాబాద్)
* 2017: రైజింగ్ పూణె సూపర్ జెయింట్(2) Vs క్వాలిఫయిర్-2 విన్నర్ - ?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahendra Singh Dhoni's whirlwind 40 not out against Mumbai Indians in the Indian Premier League (IPL) Season 10 Qualifier 1 made the telling difference in the final calculations, as that was enough to guide Rising Pune Supergiant (RPS) into the final.
Please Wait while comments are loading...