ఐపీఎల్ 10: బ్రావో కొత్త సాంగ్‌లో నటించిన ధోని, కోహ్లీ?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెటర్లతో పాటు విదేశీయులకు కూడా గౌరవం దక్కుతోంది. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లంటే ఇక్కడి అభిమానులు ఎంతగానో ఆదరిస్తారో మనందరికీ తెలిసిందే.

క్రికెట్‌తో పాటు డ్యాన్స్ అంటే ఎంతో ప్రాణమిచ్చే 33 ఏళ్ల వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో త్వరలో కొత్త పాటను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశాడు. ఐసీసీ వరల్డ్ టీ20 సమయంలో డ్వేన్ బ్రావో 'ఛాంపియన్‌' పాటను పరిచయం చేశాడు. ఈ పాట ఎంత సూపర్ డూపర్ హిట్టయ్యింతో అందరికీ తెలుసు.

MS Dhoni, Virat Kohli to feature in Dwayne Bravo's new song?

తాజాగా భారత్‌లో తన పాటను అభిమానులు ఆదరిస్తారని ముందుగానే ఊహించిన డ్వేన్ బ్రావో ఐపీఎల్‌ వేదికగా మరో పాటను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ పాటలో బ్రావో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ధోని కూడా నటించారని తెలుస్తోంది.

డ్వేన్‌ బ్రావోనే స్వయంగా ఈ పాట పాడాడు. బ్రావో సోదరులిద్దరూ ఈ పాట గురించి మాట్లాడుకుంటున్న వీడియోను గుజరాత్‌ లయన్స్‌ సోషల్‌ మీడియాలో ఉంచింది. గతంలో బ్రావో విడుదల చేసిన 'చలో చలో' ఆల్బమ్‌లో కోహ్లీ, క్రిస్‌ గేల్‌, పొలార్డ్‌, హస్సీ, ఇర్ఫాన్‌ పఠాన్‌ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Buoyed with the tremendous success of his debut song 'Champion', talented West Indies all-rounder Dwayne Bravo is planning to release a new song.
Please Wait while comments are loading...