ఐపీఎల్: వాషింగ్టన్ సుందర్‌కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వాషింగ్టన్ సుందర్... ఐపీఎల్‌‌లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. పదో సీజన్‌లో క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై పూణె విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుందర్‌ 16పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పూణె బౌలర్ వాషింగ్టన్ సుందర్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా, ఐపీఎల్ పదో సీజన్‌లో తొలిసారి ఆడుతున్న 17 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన పిన్న వయస్కుల జాబితాలో మూడో స్థానాన్ని ఆక్రమించాడు.

అసలు అతడికి వాషింగ్టన్ సుందర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలియక క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే తన కుమారుడికి వాషింగ్టన్ సుందర్ అనే పేరు ఎలా వచ్చిందో 'ది హిందు' పత్రికక ఇచ్చిన ఇంటర్యూలో సుందర్ తండ్రి వెల్లడించాడు.

నేను హిందువుని: వాషింగ్టన్ సుందర్ తండ్రి

నేను హిందువుని: వాషింగ్టన్ సుందర్ తండ్రి

'నేను హిందువుని, చాలా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చాను. చెన్నైలో నేను నివాసం ఉంటున్న ట్రిప్లికేన్ ప్రాంతంలో రెండు వీధుల అవతల పీడీ వాషింగ్టన్ అనే మాజీ ఆర్మీ జవాను నివసించేవాడు. వాషింగ్టన్‌కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. మెరీనా బీజ్‌లో నేను నా స్నేహితులతో క్రికెట్ ఆడుతుంటే చూసేందుకు అక్కడికి వచ్చేవాడు' అని వాషింగ్టన్ సుందర్ తండ్రి తెలిపాడు.

స్కూల్ యూనిఫాంతో పాటు ఫీజులు కట్టేవాడు

స్కూల్ యూనిఫాంతో పాటు ఫీజులు కట్టేవాడు

'ఆ సందర్భంలో అతడు నా ఆటను ఎంతో ఇష్టపడేవాడు. నేను పేద కుటుంబం నుంచి వచ్చిన వాడినని తెలుసుకుని నాకు స్కూల్ యూనిఫాంతో పాటు స్కూల్ ఫీజులు కూడా కట్టేవాడు. పుస్తకాలు కొనివ్వడంతో పాటు తన సైకిల్‌పై ప్రతిరోజూ నన్ను గ్రౌండ్‌కు తీసుకెళ్లేవాడు' అని చెప్పుకొచ్చాడు.

పీడీ వాషింగ్టన్ అంటే ఎంతో గౌరవం

పీడీ వాషింగ్టన్ అంటే ఎంతో గౌరవం

'పీడీ వాషింగ్టన్ అంటే నాకు ఎంతో గౌరవం. తమిళనాడు తరుపున తాను రంజీ జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు సంతోషపడిన వాళ్లలో ఆయన కూడా ఒకరు' అని ఆయన అన్నారు. వాషింగ్టన్ సుందర్ తండ్రి సుందర్ కూడా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ డివిజన్ లీగ్‌కు ఆడాడు.

హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీనివాసన్ అని పేరు పెట్టా

హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీనివాసన్ అని పేరు పెట్టా

1999లో వాషింగ్టన్ చనిపోయారు. ఆ తర్వాత అక్టోబర్‌లో సుందర్ భార్య తొలి బిడ్డకు జన్మనిచ్చింది. తన భార్యకు మొదటి డెలివరీ కావడంతో ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అయినా తమ బిడ్డ బ్రతికాడని సుందర్ తెలిపాడు. హిందూ సంప్రదాయం ప్రకారం తమ కుమారుడికి శ్రీనివాసన్ అనే పేరుని చెవిలో చెప్పానని తెలిపాడు.

వాషింగ్టన్ సుందర్‌గా పేరు మారింది

వాషింగ్టన్ సుందర్‌గా పేరు మారింది

ఆ తర్వాత కొన్నాళ్లకు తన కోసం ఎంతో శ్రమించిన వాషింగ్టన్ గుర్తుగా కుమారుడిని పేరుని వాషింగ్టన్ సుందర్ అని మార్చినట్లు తెలిపాడు. తమిళాడుకు చెందిన వాషింగ్టన్ సుందర్ 17 ఏళ్ల వయసులో తొలి ఐపీఎల్ ఆడుతున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్ గాయం కారణంగా పదో సీజన్‌కు దూరంకావడంతో, అతని స్థానంలో పూణెలో తీసుకుంది.

ఐపీఎల్ ఆడిన మూడో పిన్న వయస్కుడిగా

ఐపీఎల్ ఆడిన మూడో పిన్న వయస్కుడిగా

2015 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ మ్యాచ్ ఆడినప్పుడు సర్ఫ్‌రాజ్ ఖాన్ వయసు 17 సంవత్సరాల 177 రోజులు. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో సందీప్ సంగ్వాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున 17 ఏళ్ల 179 రోజుల వయసులో మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు సుందర్ వయసు 17 సంవత్సరాల 199 రోజులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The suspense over MS Washington Sundar's unique name has been revealed. How did this 17-year-old get this name? That has been answered by his father Sundar.
Please Wait while comments are loading...