టీ20ల్లో అరుదైన రికార్డుని సాధించిన ఏకైక జట్టుగా ముంబై (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.

టీ20ల్లో ముంబై అరుదైన ఘనత

టీ20ల్లో ముంబై అరుదైన ఘనత

ఈ విజయంతో ముంబై ఇండియన్స్ మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. టీ20 క్రికెట్‌లో వందో విజయం సాధించిన తొలి జట్టుగా ముంబై అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటివరకు 176 ట్వంటీ 20 మ్యాచ్ లాడిన ముంబై వంద విజయాలు సాధించగా, 73 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

ఇప్పటి వరకు 152 మ్యాచ్‌లు

ఇప్పటి వరకు 152 మ్యాచ్‌లు

మరో గేమ్ టైగా ముగియగా, రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటి వరకు 152 మ్యాచ్‌లు ఆడింది. అందులో 89 మ్యాచుల్లో సాధించగా, 64 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. ఒకటి గేమ్ టైగా ముగిసింది. ఐపీఎల్‌లో రెండో అత్యధిక విజయాల శాతం 58.60 నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది.

వంద ట్వంటీ 20 విజయాల్ని సాధించిన తొలి జట్టుగా

వంద ట్వంటీ 20 విజయాల్ని సాధించిన తొలి జట్టుగా

60.68 శాతంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందంజలో ఉంది. 2010 నుంచి 2014 వరకూ చాంపియన్స్ లీగ్‌లో ముంబైఇండియన్స్‌ మొత్తం 22 మ్యాచ్‌లాడి 11 విజయాలు సాధించగా, తొమ్మిది ఓటముల్ని చవిచూసింది. దీంతో మొత్తంగా కలుపుకుని వంద ట్వంటీ 20 విజయాల్ని సాధించిన తొలి జట్టుగా ముంబై నిలిచింది.

2013, 2015 సీజన్లలో ఐపీఎల్ ఛాంపియన్‌గా

2013, 2015 సీజన్లలో ఐపీఎల్ ఛాంపియన్‌గా

ఐపీఎల్‌లో ఐదు సీజన్ల వరకు ఒడిదొడుకులు ఎదుర్కొన్న ముంబై 2013, 2015 సీజన్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి రెండు సార్లు ఛాంపియన్‌గా అవతరించింది. 2010లో రన్నరప్‌గా నిలిచింది. 2011, 2012, 2014లో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లో 2011, 2013లో విజేతగా నిలిచింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two times IPL champions Mumbai Indians (MI) reached a new milestone as they became the first team in history to win 100 T20 matches.
Please Wait while comments are loading...