క్వాలిఫయిర్-2: పరుగు తీసిన పొలార్డ్, పుట్‌బాల్ ఆడిన రోహిత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌లో సిసలైన సవాల్‌కు మాజీ చాంపియన్లు సిద్ధమయ్యాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఈ రెండు జట్లలో గెలిచిన జట్టు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పూణెతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన జట్టు ఇంటికిదారి పడుతుంది. దాంతో, చావోరేవో పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్‌ పోరుకు వెళ్లాలని ఇరు జట్లూ యత్నిస్తున్నాయి.

ఇదే వేదికపై గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా ఆత్మవిశ్వాసంలో ఉండగా.. తొలి క్వాలిఫయర్‌లో పుణె చేతిలో చిత్తయిన ముంబై కాస్త డీలా పడింది. కాగా, లీగ్‌ దశలో రెండు మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతాతో ఆడిన 20 మ్యాచ్‌ల్లో 15 విజయాలతో ముంబైకి ఘనమైన రికార్డు ఉంది.

దాంతో, నైట్‌రైడర్స్‌పై తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని రోహిత్ సేన కోరుకుంటోంది. ఈ సారి ఆ రికార్డును బద్దలుకొట్టి ప్రతీకారం తీర్చుకోవాలని గంభీర్‌సేన భావిస్తోంది. అయితే, గత వారం రోజులుగా బెంగళూరులో కురుస్తున్న వర్షం ఇరు జట్లనూ ఆందోళనకు గురి చేస్తున్నాడు.

వర్షం కారణంగా ఎలిమినేటర్‌కు మూడు గంటలకు పైగా అంతరాయం కలిగింది. శుక్రవారం కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గురువారం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు.

అభిమానులతో రోహిత్ శర్మ

అభిమానులతో రోహిత్ శర్మ

చిన్నస్వామి స్టేడియంలో అభిమానులతో రోహిత్ శర్మ.

టిమ్ సౌథీ

టిమ్ సౌథీ

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ముంబై ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథి

పార్ధీవ్ పటేల్

పార్ధీవ్ పటేల్

చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ముంబై వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్.

నితీశ్ రాణా

నితీశ్ రాణా

ఐపీఎల్ పదో సీజన్‌లో ముంబై జట్టులో అద్భుత ప్రదర్శన చేస్తున్న యువ ఆటగాడు నితీశ్ రాణా. అభిమానులో సెల్ఫీ దిగుతోన్న దృశ్యం.

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్వాలిఫయిర్-2 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తోన్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.

హార్ధిక్ పాండ్యా

హార్ధిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న దృశ్యం.

జస్ ప్రీత్ బుమ్రా

జస్ ప్రీత్ బుమ్రా

గళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్వాలిఫయిర్-2 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తోన్న పేసర్ జస్ ప్రీత్ బుమ్రా.

రోహిత్ శర్మ ప్రాక్టీస్

రోహిత్ శర్మ ప్రాక్టీస్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్వాలిఫయిర్-2 మ్యాచ్ కోసం పుట్ బాల్‌ని కంట్రోల్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.

పాండ్యా బ్రదర్స్

పాండ్యా బ్రదర్స్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్వాలిఫయిర్-2 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న పాండ్యా బ్రదర్స్

పరుగు పెడుతున్న పొలార్డ్

పరుగు పెడుతున్న పొలార్డ్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్వాలిఫయిర్-2 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న పొలార్డ్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mumbai Indians (MI) take on Kolkata Knight Riders (KKR) in a crucial IPL 2017 Qualifier 2 encounter today (May 19) at the Chinnaswamy Stadium, Bengaluru.
Please Wait while comments are loading...