క్వాలిఫయిర్-2: బెంగళూరుకి చేరుకున్న ముంబై ఆటగాళ్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో క్వాలిఫయిర్-2 మ్యాచ్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ బుధవారం బెంగళూరుకు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన కోల్‌కతా క్వాలిఫయిర్-2లో ముంబైతో శుక్రవారం తలపడనుంది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు 

లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న ముంబై ఇండియన్స్ క్వాలిఫియర్-1 మ్యాచ్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ చేతిలో ఓటమిపాలైంది. వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూణె 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. మనోజ్ తివారి (58), రహానే (56), అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి ఓటమి పాలైంది.

అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్‌లోనూ సమష్టిగా రాణించిన పూణె ఈ సీజన్‌లో ముంబైపై మరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో కోల్‌కతాతో క్వాలిఫయిర్-2 మ్యాచ్ ఆడేందుకు ముంబై ఇండియన్స్ జట్టు బెంగళూరుకి చేరుకుంది. ఈ సందర్భంగా ముంబై ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

కోల్ కతా నైట్ రైడర్స్‌తో క్వాలిఫయిర్-2 మ్యాచ్ ఆడేందుకు కోల్ కతాకు చేరుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.

లెండీ సిమ్మన్స్

లెండీ సిమ్మన్స్

కోల్ కతా నైట్ రైడర్స్‌తో క్వాలిఫయిర్-2 మ్యాచ్ ఆడేందుకు కోల్ కతాకు చేరుకున్న ముంబై ఇండియన్స్ ఓపెనర్ లెండీ సిమ్మన్స్.

మిచెల్ మెకన్‌గ్లన్

మిచెల్ మెకన్‌గ్లన్

బెంగళూరుకి చేరుకున్న ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెకన్‌గ్లన్. న్యూజిలాండ్‌కు చెందిన మిచెల్ మెకన్‌గ్లన్ ముంబై తరుపున 14 మ్యాచ్‌లాడి 19 వికెట్లు తీశాడు.

పార్ధీవ్ పటేల్

పార్ధీవ్ పటేల్

బెంగళూరుకి చేరుకున్న ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్. ఐపీఎల్ పదో సీజన్‌లో పార్దీవ్ పటేల్ ముంబై తరుపున సత్తా చాటుతున్నాడు.

టిమ్ సౌథీ, మిచెన్ జాన్సన్

టిమ్ సౌథీ, మిచెన్ జాన్సన్

బెంగళూరులో ముంబై ఇండియన్స్ పేసర్లు టిమ్ సౌథీ, మిచెల్ జాన్సన్.

Note: All images are taken from Mumbai Indians Twitter handle and official website.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mumbai Indians (MI) team led by captain Rohit Sharma reached Bengaluru on Wednesday (May 17) to face Kolkata Knight Riders (KKR) in the Qualifier 2 of IPL 2017.
Please Wait while comments are loading...