ఐపీఎల్ ఉత్కంఠ: ఈ నలుగురిలో ప్లే ఆఫ్ చేరేదెవరు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు (మే 13) నాటికి ముంబై ఇండియన్స్ మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్‌కు అర్హత సాధించగా మిగతా మూడు జట్లు ఏవనేది ఇంకా అధికారికంగా తేలలేదు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు 

అయితే 16 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్‌కు చేరడం ఖాయమని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అన్ని జట్లు 13 మ్యాచ్‌ల చొప్పున ఆడగా, ముంబై 9 విజయాలతో 18 పాయింట్లతో అగ్రస్దానంలో కొనసాగుతోంది.

చెరో 8 విజయాలతో రెండు, మూడు స్ధానాల్లో కోల్‌కతా, పూణె

చెరో 8 విజయాలతో రెండు, మూడు స్ధానాల్లో కోల్‌కతా, పూణె

ఆ తర్వాత చెరో 8 విజయాలతో కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. ఈ రెండింటిలో కోల్‌కతా రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. 7 విజయాలను సాధించిన సన్ రైజర్స్ బెంగళూరుతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ లభించింది.

15 పాయింట్లతో నాలుగో స్థానంలో సన్ రైజర్స్

15 పాయింట్లతో నాలుగో స్థానంలో సన్ రైజర్స్

దీంతో 15 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. 7 విజయాలతో 14 పాయింట్ల సాధించిన పంజాబ్ ఐదో స్దానంలో కొనసాగుతోంది. ఢిల్లీ, గుజరాత్, బెంగళూరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్నాయి.

ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి

ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి

ఈ సీజన్‌లో ఇక కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో బెంగళూరు, ఢిల్లీ జరగనున్న మ్యాచ్ మినహా మిగతా మూడు మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి. నాలుగో స్ధానం కోసం పూణె, హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

సన్ రైజర్స్‌కు కీలకంగా మారిన కాన్పూర్ మ్యాచ్

సన్ రైజర్స్‌కు కీలకంగా మారిన కాన్పూర్ మ్యాచ్

శనివారం కాన్పూర్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్‌కు చేరుతుంది. అలాకాకుండా ఆదివారం పూణె, పంజాబ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధిస్తే 16 పాయింట్లతో పూణె ప్లే ఆఫ్ అవకాశాలకు గండి కొడుతుంది.

సన్ రైజర్స్ ఓటమి పాలైతే

సన్ రైజర్స్ ఓటమి పాలైతే

ఈ రెండింటిలో పంజాబ్‌కు మెరుగైన రన్ రేట్‌ను కలిగి ఉంది. దీంతో పంజాబ్ జట్టు నాలుగో స్ధానాన్ని దక్కించుకుంటుంది. అయితే శనివారం లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఓటమి పాలైతే పంజాబ్‌పై పూణె గెలిస్తే హైదరాబాద్‌కు అనుకూలంగా మారుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian Premier League (IPL) 2017 has reached an exciting stage with four teams battling for the remaining three play-off spots. Mumbai Indians (MI) are the only side to have qualified for the knockouts as of today (May 13).
Please Wait while comments are loading...