న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: ఈడెన్‌లో ఊతప్పకు కలిసొచ్చిన అంఫైర్ తప్పిదం

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అంపైర్ తప్పిదాలు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్పకు బాగా కలిసొచ్చింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అంపైర్ తప్పిదాలు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్పకు బాగా కలిసొచ్చింది.

ఐపీఎల్, మ్యాచ్ 14: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ఐపీఎల్, మ్యాచ్ 14: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కోల్ కతా నైట్ రైడర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చక్కటి శుభారంభాన్నిచ్చాడు. భువీ వేసిన మూడో ఓవర్‌ రెండో బంతికి కోల్‌కతా ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (6) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

SRH fielders can't believe that Robin was given not out. Photo courtesy: BCCI

అనంతరం క్రీజులోకి రాబిన్ ఊతప్ప వచ్చాడు. రాబిన్ ఊతప్ప ఎదుర్కొన్న తొలి బంతి ఎడ్జి తీసుకుని వికెట్ కీపర్ నోమన్ ఓజా చేతిలో పడింది. దీంతో బౌలర్ భువనేశ్వర్ కుమార్ తో పాటు హైదరాబాద్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే అంఫైర్ అనిల్ దండేకర్ నాటౌట్ ఇచ్చాడు.

ఈ నిర్ణయం సన్ రైజర్స్ ఆటగాళ్లను నిరాశకు గురి చేసింది. రాబిన్ ఊతప్ప క్లియర్‌గా అవుటైనట్లు కనిపిస్తున్నా అంఫైర్ నాటౌట్ అని ప్రకచింటడం ఆటగాళ్లతో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులను కూడా విస్మయానికి గురి చేసింది.

తనకు లభించిన లైఫ్ లైన్‌తో రాబిన్ ఊతప్ప (39 బంతుల్లో 68, 5 ఫోర్లు, 4 సిక్సులతో) అర్ధసెంచరీని పూర్తి చేశాడు. జట్టు స్కోర్‌ 10 వద్ద ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (6) అవుటైనప్పుడు క్రీజులోకి వచ్చిన రాబిన ఉతప్ప తొలుత ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత వేగంగా ఆడుతూ బౌండరీలు, సిక్సర్లు బాదాడు.

సన్ రైజర్స్ బౌలర్ రషీద్‌ వేసిన 11.2 బంతిని బౌండరీకి తరలించి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకొన్నాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో తరుచుగా అంఫైరింగ్ పొరపాట్లు, తప్పిదాలు దర్శనమిస్తున్నాయి. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంఫైర్లు గుడ్డిగా వ్యవహరించి, పెద్ద తప్పిదానికే కారణమయ్యారు.

మ్యాచ్‌ ఆరో ఓవర్‌లో అంఫైర్లు కునుకుతీస్తూ నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఆరో ఓవర్‌ చివరి బంతిని ఎదుర్కోవడమే కాకుండా.. ఏడో ఓవర్‌ మొదటి బంతిని కూడా ఆడాడు. వార్నర్‌ ఏడో ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కోవడాన్ని ఈ ఇద్దరితోపాటు టీవీ అంపైర్‌ కూడా గుర్తించకపోవడం ఆశ్చర్యకరం.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X