ఐపీఎల్ 2017: అందుబాటులో ఐపీఎల్ టికెట్లు, ధరలు ఇలా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఐపీఎల్‌ 10వ సీజన్‌ టిక్కెట్ల అమ్మకం త్వరలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ముంబై, బెంగళూరు తదితర జట్లు సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచాయి.

మార్చి 25 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే ఏడు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు విక్రయించనున్నారు. ఏప్రిల్ 4న ఐపీఎల్ 10 ప్రారంభ వేడుకలు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకలకు సంబంధించిన టిక్కెట్లను మాత్రం ఏ జట్టు అందుబాటులోకి తీసుకురాలేదు.

IPL 2017: Price, availablity of stadium tickets out

కాగా, హైదరాబాద్‌లో జరిగే 7 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 5న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian Premier League fever is slowly gathering steam and once again the entire country is waiting for the mega event to kick-off. Like it has been for many years, the tournament is already in the news for plenty of happenings.
Please Wait while comments are loading...