కోల్‌కతాని దెబ్బకొట్టిన కర్ణ్ శర్మ: క్వాలిఫయిర్-2 మ్యాచ్ హైలెట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియం పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుండటంతో బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫియర్-1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తడబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లు కూడా ఆడకుండానే చేతులెత్తేసింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు 

కర్ణ్‌శర్మ(4/16), బుమ్రా(3/7) ధాటికి కోల్‌కతా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 18.5 ఓవర్లలో కోల్‌కతా 107 పరుగులు చేసి ఆలౌటయ్యారు. దీంతో ముంబై ఇండియన్స్ విజయ లక్ష్యం 108 పరుగులుగా నిర్దేశించింది. కోల్‌కతా ఓపెనర్లు క్రిస్‌లిన్(4), నరైన్(10) నిరాశపరిచారు.

Karn Sharma shines for MI

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప(1), గంభీర్(), గ్రాండ్ హోమ్ డకౌట్‌గా వెనుదిరగడంతో కోల్‌కతా 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇషాంక్ జగ్గి(28), సూర్య కుమార్ యాదవ్(31)లు కాస్త ఫర్వాలేదనిపించారు. వీరిద్దరి జోడీ 56 పరుగులు జోడించడంతో కోల్‌కతా వంద పరుగుల మైలురాయిని అందుకుంది.

జగ్గి ఏడో వికెట్‌గా అవుటైన తరువాత కోల్‌కతా వరుసగా వికెట్లను కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కర్ణ్ శర్మ 4 ఓవర్లు వేసిన 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి కోల్‌కతా నడ్డి విరిచాడు. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ నాలుగు, జస్ప్రిత్ బుమ్రా మూడు, మిచెల్ జాన్సన్ రెండు, మలింగ ఒక వికెట్ తీశారు.

ముంబై Vs కోల్‌కతా మ్యాచ్ హైలెట్స్:

* కోల్‌కతా మొదటి వికెట్‌ను రెండో ఓవర్‌లో కోల్పోయింది. జస్ ప్రీత్ బుమ్రా వేసిన ఓవర్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రిస్ లిన్ పెవిలియన్‌కు చేరాడు.
* కర్ణ్ శర్మ తన తొలి ఓవర్‌లోనే మరో ఓపెనర్ సునీల్ నరేన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.
* కర్ణ్ శర్మ బౌలింగ్‌లో డీప్ వికెట్‌ వద్ద హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి గంభీర్ వెనుదిరిగాడు.
* 7 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి కోల్‌కతా 31 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఐపీఎల్ చరిత్రలోనే కోల్‌కతాకు ఇది చెత్త ఓపెనింగ్.
* 6వ వికెట్‌కు జగ్గీ, సూర్యకుమార్ యాదవ్ 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* కర్ణ్ శర్మ 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి కోల్ కతా నడ్డివిరిచాడు.
* ఐపీఎల్ ప్లే ఆఫ్ గేమ్స్‌లో అతడికి ఇది మూడో అత్యుత్తమం.
* మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో నాథన్ కౌల్టర్ నైలీ సిక్సు బాదడంతో కోల్ కతా 100 పరుగుల మైలురాయిని అందుకుంది.
* తన చివరి ఓవర్‌లో మిచెల్ జాన్సన్ 2 వికెట్లు తీసి 28 పరుగులిచ్చాడు.
* కోల్ కతా తరుపున 31 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.
* కోల్ కతా ఇన్నింగ్స్‌లో కేవలం మూడు సిక్సులు బాదారు.
* మూడు ఓవర్లలో 7 పరుగులిచ్చిన జస్ ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు.
* ఆఖరి ఓవర్‌లో లసిత్ మలింగ ఒక వికెట్ తీశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mumbai Indians bowlers vindicated Rohit Sharma's decision to bowl first as they bundled Kolkata Knight Riders out for 107 in 18.5 overs in the second Qualifer of the Indian Premier League (IPL) 2017 here on Friday (May 19).
Please Wait while comments are loading...