చిన్ననాటి హీరో యువరాజ్‌తో డ్రెస్సింగ్ రూమ్ షేరింగ్‌పై రషీద్ ఖాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన చిన్ననాటి హీరో యువరాజ్ సింగ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే సందర్భం కోసం తానెంతగానో ఎదురుచూస్తున్నానని ఆప్ఘనిస్థాన్ యువ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. గత మూడు నెలలు తనకొక కలగా ఉందని చెప్పుకొచ్చాడు.

గ్రేటర్ నోయిడాలోని ఆప్ఘనిస్ధాన్ హోం గ్రౌండ్లో ఐర్లాండ్‌తో సిరిస్ ఆడేందుకు వచ్చిన రషీద్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా గత మూడు నెలలు తన జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపాయని చెప్పాడు. ప్రపంచంలోనే ఐపీఎల్ అతి పెద్ద క్రికెట్ టోర్నీ అని అన్నాడు.

యువరాజ్ సింగ్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్ లాంటి క్రికెట్ దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఐపీఎల్ వేలానికి ముందు నుంచే ఎంతో కష్టపడ్డానని, ఎవరి ఆటనైతే టీవీలో చూసి పెరిగానో అలాంటి ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని పేర్కొన్నాడు.

ఐపీఎల్ ఎవరిని కలిసేందుకు మీరు ఆతృతగా ఉన్నారన్న ప్రశ్నకు గాను... 'చిన్నప్పటి నుంచి యువరాజ్ సింగ్‌కు వీరాభిమానిని. యువీ దూకుడంటే ఎంతో ఇష్టం. అతనితో కొంత సమయం గడిపి క్రికెట్‌కు సంబంధించిన కొన్ని విషయాలను అడిగి తెలుసుకుంటా' అని రషీద్ ఖాన్ చెప్పాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సపోర్టింగ్ స్టాప్‌గా ఉన్న దిగ్గజ క్రికెటర్లు టామ్ మూడీ, వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీ ధరన్‌లను కలిసేందుకు కూడా ఆతృతతో ఉన్నానని తెలిపాడు. ఐపీఎల్ వేలం తర్వాత టామ్ మూడీ సార్‌తో మాట్లాడానని, జట్టులోకి తనను ఆహ్వానించాడని చెప్పాడు.

రషీద్‌ను రూ. 4 కోట్లకు

రషీద్‌ను రూ. 4 కోట్లకు

రషీద్‌ను రూ. 4 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
గతనెలలో బెంగుళూరులో జరిగిన వేలంలో 18 ఏళ్ల రషీద్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 10వ ఎడిషన్‌లో ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఐదుగురు ఆటగాళ్లు వేలం బరిలో నిలిస్తే, అందులో ఇద్దరు ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.

తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్‌గా నబీ గుర్తింపు

తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్‌గా నబీ గుర్తింపు

ఐపీఎల్ వేలంలో తొలుత ఆప్ఘనిస్థాన్ సీనియర్ ఆటగాడు మొహ్మద్ నబీని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 30లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్‌గా నబీ గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రషీద్‌ని కూడా హైదారాబాద్ జట్టే కొనుగోలు చేసింది.

జింబాబ్వే పర్యటనలో ఉన్న సమయంలో

జింబాబ్వే పర్యటనలో ఉన్న సమయంలో

కాగా, జింబాబ్వేతో వన్డే సిరిస్‌లో భాగంగా తాను హరారేలో ఉన్నానన్న రషీద్, ఐపీఎల్ వేలం జరిగే సమయానికి తాను గాఢ నిద్రలో ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే వేలంలో తన పేరు ఉండటంతో ఆప్ఘనిస్థాన్‌లోని నాన్గర్ ప్రావిన్స్‌లో ఉన్న తన తల్లి దండ్రులు వేలాన్ని వీక్షించేందుకు వేకువజామునే లేచి టీవీల ముందు కూర్చున్నారని రషీద్ తెలిపాడు.

ఐపీఎల్ బిడ్డింగ్‌ని వీక్షించా

ఐపీఎల్ బిడ్డింగ్‌ని వీక్షించా

తాను గాఢ నిద్రలో ఉన్న సమయంలో తన పేరు బిడ్డింగ్‌కు వస్తుందన్న విషయాన్ని వారే ఫోన్ చేసి చెప్పారన్నాడు. నిద్రమత్తులో ఉన్న తాను అలానే ఐపీఎల్ బిడ్డింగ్‌ని వీక్షించినట్లు చెప్పుకొచ్చాడు. 'జింబాబ్వే సిరీస్‌లో తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకలేదు. ఆ క్రమంలోనే నేను సోమవారం నిద్రమత్తులో ఉన్నా. ఐపీఎల్ వేలం జరుగుతుందనే విషయం తెలుసు. కానీ బాగా అలసటగా ఉండి అలానే పడుకున్నా' అని రషీద్ చెప్పాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Eighteen-year-old Afghan sensation Rashid Khan can't wait to start his maiden stint in the IPL with Sunrisers Hyderabad, where he will be sharing the dressing room with his childhood hero Yuvraj Singh.
Please Wait while comments are loading...