ఏమైంది?: జడేజాను చూసి పడి పడి నవ్విన కోహ్లీ (ఫోటో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి రాజ్‌కోట్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గుజరాత్ లయన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీవీ కెమెరాలన్నీ కోహ్లీని చూపెట్టాయి.

IPL 2017: Ravindra Jadeja's New 'Break The Beard' Look Takes Twitter By Storm

ఇక ఈ మ్యాచ్‌లో సరికొత్త హెయిర్ స్టయిల్‌తో గుజరాత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న జడేజా దగ్గరికి వెళ్లిన కోహ్లీ... జడేజా హెయిర్ స్టైయిల్‌ను చూసి పడిపడి నవ్వాడు. నిజానికి టీమిండియాలో కోహ్లీ తర్వాత ఫ్యాషన్‌ని అనుకరించే క్రికెటర్లు తక్కువే.

ఇటీవల కాలంలో రవీంద్ర జడేజా, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ తదితరులు గత కొంతకాలంగా ఫ్యాషన్‌తో అభిమానులను అలరిస్తున్నారు. పదో సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడుతున్న యువీ, ధావన్ ఇప్పటికే కొత్త కొత్త స్టయిల్స్‌తో మైదానంలో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's cash-rich T20 tournament, the Indian Premier League (IPL), is an event where cricket and glamour goes hand in hand. From celebrity owners to hot cheerleaders, the tournament is a mecca for the more modernised version of cricket.
Please Wait while comments are loading...