క్రిస్ గేల్ కొత్త స్టైల్: ‘సాల్ట్‌ బీ’, బ్యాట్‌పై ఉప్పు చల్లాడు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ ఏదైనా రికార్డు సృష్టించినా లేక ఏదైనా రికార్డు బద్దలు కొట్టిన సంబరాలు జరుపుకునే స్టయిలే వేరు. వైవిధ్యమైన స్టెప్పులతో అభిమానులను అలరిస్తుంటారు.

తాజాగా ఐపీఎల్ పదో సీజన్‌లో మంగళవారం రాత్రి రాజ్‌కోట్‌ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో గుజరాత్‌ లయన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీసి మూడు పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

దీంతో టీ20 క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు. ఐపీఎల్ పదో సీజన్‌కు ముందు 63 పరుగుల దూరంలో ఉన్న గేల్ ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌ల్లో ఈ రికార్డుని సాధిస్తాడని అభిమానులు భావించినా అది జరగలేదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన 60 పరుగులు మాత్రమే చేశాడు.

IPL 2017: 'Salt-Bae' Chris Gayle Roars Back to Life in League

ఐపీఎల్ ఆరంభ వేడుకల అనంతరం సన్ రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో క్రిస్ గేల్ 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి రావడంతో రెండు మ్యాచ్‌లకు గేల్ దూరమయ్యాడు.

ఇలా ఈ సీజన్‌లో వరుస వైఫల్యాల తర్వాత మంగళవారం క్రిస్ గేల్ ఈ రికార్డుని సాధించాడు. రికార్డు సాధించిన ఆనందంలో క్రిస్ గేల్ గతంలో మాదిరి 'గంగ్నం స్టయిల్‌లో' కాకుండా కొత్త హావభావాలు, కదలికలతో సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ స్టయిల్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ అర్ధసెంచరీ చేసిన తర్వాత కోహ్లీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మోకాలిపై కూర్చొని బ్యాట్‌ను మరో చేత్తో రెండుసార్లు చరిచాడు. చేతి పైకెత్తి ఏదో చల్లుతున్నట్లు చేశాడు. దీనిని 'సాల్ట్‌ బీ' స్టైల్‌ అంటారు. టర్కీలోని ఓ షెఫ్‌ రెస్టారెంట్‌లో మాంసాన్ని వండేముందు దానికి మసాలా రాస్తారంట.

అనంతరం మాంసంపా రెండు దెబ్బలు వేసి పైనుంచి ఉప్పు చల్లుతారంట. ఈ వీడియోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. దీంతో రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఇలానే ప్రవర్తించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Self-proclaimed 'Universe Boss' Chris Gayle roared back to life in the Indian Premier League (IPL) after his stunning half-century helped Royal Challengers Bangalore beat Gujarat Lions by 21 runs in the tenth edition of the league on Wednesday.
Please Wait while comments are loading...