సూపర్‌మ్యాన్: సంజూ శాంసన్ సిక్స్‌ను ఎలా ఆపాడో చూడండి (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఎందుకంటే మ్యాచ్‌కి ముందు ఆటగాళ్లు బౌండరీ లైన్‌ దగ్గర గాలిలో ఎగిరి క్యాచ్‌లు ఎలా పట్టాలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు

ఐపీఎల్ పాయింట్ల పట్టిక

ఐపీఎల్ 2017 ఫోటోలు

శుక్రవారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్‌ వద్ద సూపర్‌ మ్యాన్‌లా గాలిలోకి ఎగిరి.. సిక్సర్‌ను క్యాచ్‌ పట్టుకోవడంతో పాటు, తాను బౌండరీలైన్‌ అవతల పడుతున్నట్టు గుర్తించి వెంటనే బంతిని విసిరేశాడు.

IPL 2017: Sanju 'Superman' Samson Flies to Stop a Six

దీంతో సంజూ శాంసన్ బంతి సిక్సు పోకుండా ఆపాడు. క్రిస్ మోరిస్ వేసిన 19వ ఓవర్ రెండో బంతిని క్రీజులో ఉన్న నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ మనీష్‌ పాండే బలంగా బాదాడు. టీవీలో కనిపించిన దాని ప్రకారం దాదాపు సిక్సర్‌ అని అందరూ అనుకున్నారు.

ఈ సమయంలో సంజూ అనూహ్యంగా కుడివైపు జంప్‌ చేస్తూ.. గాలిలోకి ఎగిరి బంతిని అదుకొని.. రెప్పపాటులోనే దానిని మైదానంలోకి విసిరేశాడు. దీంతో సంజు బౌండరీలైన్‌ అవతల పడినా.. సిక్సర్‌ వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో మీకోసం...

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Spectacular catches at the boundary line is no longer considered a one-off phenomenon as team practice the same for hours during training sessions ahead of every game. But what Delhi Daredevils' Sanju Samson did on Friday at the Ferozeshah Kotla during the KKR innings was indeed special, more so because he is often used to wearing the big gloves and standing behind the stumps.
Please Wait while comments are loading...