ఐపీఎల్: కోహ్లీ తర్వాత.. బెంగళూరుకు మరో షాక్, సర్ఫరాజ్ సత్తా తెలుసునని..

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: గాయాలపాలైన విరాట్ కోహ్లీ బదులుగా ఏబీ డివిల్లియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును లీడ్ చేయనున్నారు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు బెంగళూరు జట్టుకు డివిల్లీయర్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో బాధాకరమైన వార్త. కేఎల్ రాహుల్ కూడా భుజానికి గాయం కారణంగా దూరం కానున్నాడు. సర్జరీ కోసం ఆయన త్వరలో లండన్ వెళ్లనున్నాడు. 24 ఏళ్ల ఈ ఆటగాడికి ఐదు వారాల క్రితం గాయమైంది. అతను గాయంతోనే సిరీస్ ఆడాడు.

మరోవైపు, కోహ్లీ గురించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ డానియల్ వెట్టోరీ స్పందించాడు. కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేడా అనే విషయం ఇప్పుడే చెప్పలేమన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ విషయం తెలుస్తుందన్నాడు. కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా డివిల్లీయర్స్ బాధ్యతలు చేపడతాడని, అదే సమయంలో కోహ్లీ స్థానంలో మరొక బ్యాట్సుమెన్‌ను చూడాలన్నాడు.

IPL 2017: Sarfaraz Khan to replace injured Virat Kohli, says Daniel Vettori

ఏప్రిల్ 2న కోహ్లీ జట్టుతో కలుస్తాడని, ఆయనకు అయిన గాయం ఎలా ఉందో తెలిసిన తర్వాత జట్టుకు సేవలు ఉంటాయా లేదా తెలుస్తుందన్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఉంటుందన్నాడు.

సర్ఫరాజ్ ఖాన్ మంచి ఆటగాడని, అతను ఎంతటి టాలెంట్ ఆటగాడో ప్రతి ఒక్కరికి తెలుసునని వెట్టోరీ చెప్పాడు.

కాగా, ఐపీఎల్‌ ఆరంభం నుంచి అదరిపోయే ఆటతీరుతో అలరించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అభిమానుల మనసులు గెలిచింది కానీ ఒక్క టైటిల్‌ కూడా నెగ్గలేకపోయింది. మూడు సార్లు ఫైనల్‌కు చేరి టైటిల్‌కు దగ్గరగా వచ్చినా దురదృష్టం వెంటాడడంతో రన్నర్‌పతో సరిపెట్టుకుంది.

దూకుడైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సారథ్యంలోనైనా ఈ లోటు తీరుతుందనుకుంటే గతేడాది ఫైనల్లోనూ నిరాశే ఎదురైంది. 2016లో సన్ రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో లక్ష్య ఛేదనలో గెలుపు వాకిట్లో చతికిలపడింది. స్టార్‌ ఆటగాళ్లతో కిటకిటలాడుతున్న బెంగళూరు పదో అంచెలోనైనా టైటిల్‌ను ఒడిసిపట్టాలని తహతహలాడుతోంది.

పైగా టీమిండియాకు వరుస విజయాలు అందిస్తూ దూసుకెళ్తున్న కోహ్లీ.. ఈసారి ఎలాగైనా టీమ్‌ను చాంపియన్‌గా నిలబెడతాడనే అంచనా ఉంది. విరాట్‌కు తోడు విధ్వంసక వీరులు క్రిస్‌ గేల్‌, ఏబీ డివిల్లియర్స్, షేన్‌ వాట్సన్‌ చెలరేగితే బెంగళూరు ఖాతాలో టైటిల్‌ చేరడం ఖాయమే అనిపిస్తోంది.

అలా జరగాలంటే కోహ్లీసేన బౌలింగ్‌ బలహీనతలను అధిగమించాలి. అందుకే ఈ సారి వేలంలో ఆల్‌రౌండర్‌ పవన్‌ నేగి, ఇంగ్లండ్‌ పేసర్‌ తైమల్‌ మిల్స్‌ని దక్కించుకుంది. ఈ ఇద్దరి చేరికతో బౌలింగ్‌ విభాగంలో బ్యాలెన్స్‌ ఏర్పడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AB de Villiers is likely to lead Royal Challengers Bangalore in the initial phase of Indian Premier League 10 in case Virat Kohli fails to recover from a shoulder injury.
Please Wait while comments are loading...