వాంఖడెలో ధోని విశ్వరూపం: ప్రశంసలతో ముంచెత్తిన స్మిత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో ముంబైపై ఘన విజయం సాధించి పూణె తుది పోరుకు అర్హత సాధించింది. పూణె పైనల్స్‌కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించిన ధోనిపై ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ పొగడ్తలతో ముంచెత్తాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 40 పరుగులు చేయడంతో పూణె 162 పరుగులు చేసింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో ధోని-తివారిల జోడీ చెలరేగి ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

దీంతో ముంబై ఇండియన్స్‌పై పూణె 20 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ మాట్లాడాడు. ధోని అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు.

IPL 2017: Steven Smith Hails MS Dhoni After Wankhede Heroics

'ఈరోజు బిగ్ డే, బిగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. చివర్లో మజోన్ తివారీతో కలిసి ధోని సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రహానే జట్టుకు చక్కటి శుభారంబాన్ని అందించాడు' అని స్మిత్ అన్నాడు. నిజానికి వాంఖడె పిచ్‌ను బౌలింగ్ పిచ్‌గా పరిగణించామని, దీనికి కావల్సిన పరుగులను చివర్లో తివారి, ధోని రాబట్టారని స్మిత్ పేర్కొన్నాడు.

పిచ్ మందకోడిగా ఉందని. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్నప్పటికీ ధోని పరుగుల రాబట్టడాని స్మిత్ కొనియాడాడు. 18 ఓవర్లకు గాను పూణె 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. దీంతో పూణె... ముంబై ఇండియన్స్‌కు సాధారణ లక్ష్యాన్నే నిర్దేస్తుందని అందరూ భావించారు.

కానీ, మెక్లిన్‌గన్ వేసిన19 ఓవర్లో మనోజ్ తివారీ నో బాల్‌ను బౌండరీకి బాది, ఆ తర్వాతి ఫ్రీ హిట్ బంతిని సిక్సర్‌గా మలిచాడు. అనంతరం సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్ వచ్చిన ధోని సిక్సర్లతో విరుచుకుపడటంతో పుణె ఈ ఓవర్లో 26 పరుగులు రాబట్టింది.

ఇక బుమ్రా వేసిన చివరి ఓవర్ చివరి బంతికి తివారి రనౌట్ అయినా ముంబై జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ధోని రెండు సిక్స్‌లు బాదడంతో పూణెకు చివరి ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. బుధవారం జరిగే కోల్‌కతా-హైదరాబాద్ మ్యాచ్‌లో నెగ్గే జట్టు‌తో పూణె ఫైనల్‌లో తలపడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rising Pune Supergiant skipper Steven Smith hailed MS Dhoni after the former captain struck an unbelievable innings to guide Pune into their maiden Indian Premier League (IPL) final on Tuesday.
Please Wait while comments are loading...