సన్‌రైజర్స్ సంబరాలు: యువరాజ్ ఏం చేశాడో తెలుసా! (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతుంది. బుధవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన సన్ రైజర్స్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది.

ఇక ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన సన్‌రైజర్స్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ (51బంతుల్లో89; 7 ఫోర్లు, ఒక సిక్సు), శిఖర్ ధావన్‌ల జోడీ అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్ 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులుచేసి ఓటమిపాలైంది.

మ్యాచ్ ముగిసిన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బుధవారం రాత్రి తాము బసచేస్తున్న హోటల్‌కు చేరుకోగానే జట్టు మొత్తం సంబరాలు చేసుకుంది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విలియమ్సన్‌కు 'బ్లాక్‌' కేక్‌, మరో ఆటగాడు దీపక్‌ హుడా కోసం 'వైట్‌' కేక్‌ను సిద్ధం చేశారు.

బస్సు దిగి హోటల్‌లోకి వెళ్లగానే తన ముందున్న కేక్‌ను చూసిన విలియమ్సన్ తన ముఖం మొత్తం కేక్‌ పూస్తారని ముందే ఊహించి తన రెండు చేతులతో ముఖాన్ని కప్పి ఉంచే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన యువరాజ్ సింగ్ బలవంతంగా విలియమ్సన్‌ రెండు చేతులను పక్కకు తీయడంతో మిగతా ఆటగాళ్లు విలియమ్సన్‌ ముఖానికి కేక్‌ పూశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunrisers Hyderabad are quite into party mode nowadays, with Yuvraj Singh almost always leading the action. This time around, it was New Zealander Kane Williamson's turn to be on the receiving end as he was smeared with chocolate cake after his match-winning knock against Delhi Daredevils in Hyderabad on Wednesday.
Please Wait while comments are loading...