ప్లే ఆఫ్ జట్లు ఇవే: వేదిక, షెడ్యూల్ ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉత్కంఠగా సాగిన ఐపీఎల్‌లో ప్లేఆఫ్ రేసుకు చేరిన మూడు జట్లు తేలిపోయాయి. ప్లేఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టు ఏదనేది చివరి రోజు (ఆదివారం) తేలనుంది.

చావోరేవో పోరులో ఆదివారం పుణె, పంజాబ్‌ ఢీకొననున్నాయి. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టు ముందంజ వేస్తుంది. మంబై అందరికంటే ముందే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

శనివారం హైదరాబాద్‌, కోల్‌కతా జట్లు కూడా ప్లేఆఫ్ చేరుకున్నాయి. గుజరాత్‌ను ఓడించి 17 పాయింట్లతో హైదరాబాద్‌ బెర్తు దక్కించుకుంది. ముంబై చేతిలో ఓడినప్పటికీ పుణె, పంజాబ్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో కోల్‌కతా కూడా ప్లేఆఫ్స్‌లో చోటు సొంతం చేసుకుంది.

ఆదివారం పంజాబ్‌ విజయం సాధిస్తే పుణె, కోల్‌కతాలతో ఆ జట్టు 16 పాయింట్లతో సమానంగా ఉంటుంది. అయితే రన్ రేట్‌లో పుణె కంటే మెరుగ్గా ఉన్న పంజాబ్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. అప్పుడు 17 పాయింట్లతో హైదరాబాద్‌ పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది.

IPL 2017: Teams for play-offs, venues and schedule (May 16 to 19)

ఒకవేళ పుణె గెలిస్తే 18 పాయింట్లతో ఆ జట్టు రెండో స్థానానికి ఎగబాకుతుంది. 16 పాయింట్లతో కోల్‌కతా నాలుగో స్థానంలో నిలుస్తుంది. ఆదివారం రాత్రి బెంగళూరు, ఢిల్లీ మధ్య నామమాత్ర పోరు ఉంటుంది.

ప్లే ఆఫ్ షెడ్యూల్

మే 16 (మంగళవారం) - క్వాలిఫయర్ 1 (రాత్రి 8 గంటలకు) - ముంబై (వాంఖేడే స్టేడియం)

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ లేదా రైసింగ్ పుణే సూపర్ జెయింట్స్

మే 17 (బుధవారం) - ఎలిమినేటర్ (రాత్రి 8 గంటలకు) - బెంగళూరు (చిన్నాస్వామి స్టేడియం)

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ హైదరాబాద్ లేదా పంజాబ్

మే 18 - రెస్ట్ డే

మే 19 (శుక్రవారం) - క్వాలిఫయర్ 2 (రాత్రి 8 గంటలకు) - బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం)

లూజర్ ఆఫ్ క్వాలిఫయర్ 1 వర్సెస్ విన్నర్ ఆఫ్ ఎలిమినేటర్

మే 20 - రెస్ట్ డే

మే 21 (ఆదివారం) - ఫైనల్ (రాత్రి 8 గంటలకు) - హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం)

విన్నర్ ఆఫ్ క్వాలిఫయర్ 1 వర్సెస్ విన్నర్ ఆఫ్ క్వాలిఫయర్ 2

మే 22 (సోమవారం) - రిజర్వ్ డే

గమనిక - క్వాలిఫయర్స్‌కు, ఎలిమినేటర్‌కు రిజర్వే డేలు లేవు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mumbai Indians (MI) will have home advantage in the Indian Premier League (IPL) 2017 play-offs after emerging as number one in the 8-team standings.
Please Wait while comments are loading...