ఐపీఎల్: అగ్రస్ధానం వార్నర్‌దే, ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో ఇప్పటికే 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో మొట్టమొదట ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలవగా మిగతా జట్లు ఏంటన్నవి ఇంకా ఖరారు కాలేదు. పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న జట్లే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

ఈ యాభై మ్యాచ్‌ల ఐపీఎల్ పదో సీజన్‌లో క్రికెట్ అభిమానులు ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలతో పాటు చెత్త ప్రదర్శలను కూడా చూశారు. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన బ్యాట్స్ మెన్‌కి ఇచ్చి ఆరెంజ్ క్యాప్ కోసం ఆటగాళ్లు పోటీ పడుతున్నారు.

అయితే ఆరెంజ్ క్యాప్ రేసులో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 5 సెంచరీలు నమోదయ్యాయి. అందులో ఢిల్లీ నుంచి సంజూ శాంసన్, హైదరాబాద్ నుంచి డేవిడ్ వార్నర్, పంజాబ్ నుంచి ఆమ్లా రెండుసార్లు, పూణె నుంచి బెన్ స్టోక్స్ సెంచరీలు చేశారు.

ఇక ఢిల్లీకి చెందిన యువ ఆటగాళ్లు రిషబ్ పంత్(97), శ్రేయస్ అయ్యర్ (96)తో తృటిలో సెంచరీలు మిస్సయ్యారు. లీగ్ మ్యాచ్‌లు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ఈ సీజన్‌లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తప్పుకున్నాయి.

50 మ్యాచ్‌ల తర్వాత టాప్ 10 బ్యాట్స్ మెన్స్ వీరే (మే 11, 2017):

డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్

12 మ్యాచ్‌ల్లో 535 పరుగులతో డేవిడ్ వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇందులో ఒక సెంచరీ మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇందులో 52 ఫోర్లు, 24 సిక్సులు ఉన్నాయి.

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్

డేవిడ్ వార్నర్ తర్వాత రెండో స్ధానంలో సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కొనసాగుతున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 450 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.

సురేశ్ రైనా

సురేశ్ రైనా

గుజరాత్ కెప్టెన్ అయిన సురేశ్ రైనా 13 మ్యాచ్‌ల్లో 430 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రైనా ముూడో స్ధానంలో ఉన్నాడు.

గౌతం గంభీర్

గౌతం గంభీర్

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్లలో నాలుగో స్ధానంలో కొనసాగుతున్నాడు. 13 మ్యాచ్‌లాడిన గంభీర్ 433 పరుగులు చేశాడు.

హషీం ఆమ్లా

హషీం ఆమ్లా

ఐపీఎల్ పదో సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు హషీం ఆమ్లా. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన ఆమ్లా 420 పరుగులు చేశాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న ఆమ్లా ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

రాబిన్ ఊతప్ప

రాబిన్ ఊతప్ప

రాబిన్ ఊతప్ప కోల్ కతా జట్టు తరుపున అత్యధిక పరుగులు చేశాడు. 10 ఇన్నింగ్స్‌లు ఆడిన రాబిన్ ఊతప్ప 384 పరుగులు చేశాడు.

సంజూ శాంసన్

సంజూ శాంసన్

ఐపీఎల్ పదో సీజన్‌లో వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్ సంజూ శాంసన్. మొత్తం 12 మ్యాచ్ లాడిన సంజూ శాంసన్ 384 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

స్టీవ్ స్మిత్

స్టీవ్ స్మిత్

పూణె రైజింగ్ సూపర్ జెయింట్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ 11 మ్యాచ్‌ల్లో 367 పరుగులు చేసి ఎనిమిదో స్ధానంలో కొనసాగుతున్నాడు.

మనీష్ పాండే

మనీష్ పాండే

కోల్ కతాకు చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే 12 మ్యాచ్‌ల్లో 363 పరుగులు చేశాడు. దీంతో టాప్ 10 బ్యాట్స్ మెన్లలో చోటు దక్కించుకున్నాడు.

దినేశ్ కార్తీక్

దినేశ్ కార్తీక్

గుజరాత్ లయన్స్ జట్టుకు చెందిన వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ అయిన దినేశ్ కార్తీక్ 12 మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian Premier League is nearing its end as 50 games have already been completed. Except Mumbai Indians it's still not confirmed which other three teams will make it to the play-offs as 4 teams are still into the contention for top four.
Please Wait while comments are loading...